తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు టిడిపి పార్టీ ని పైకి తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. బలహీనమైన సంఖ్యా సభ్యులు కలిగిన కానీ ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ప్రభుత్వంపై అన్ని విధాలా పోరాటం చేస్తున్నారు చంద్రబాబు. ఇసుక విషయంలో మరియు ఇంగ్లీష్ మీడియం విషయంలో పోరాటం చేసిన పెద్దగా ప్రజల నుండి స్పందన రాలేదు.అయితే ప్రస్తుతం అమరావతి విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన వాతావరణం ఆంధ్ర రాష్ట్రంలో నెలకొంది. ఇందు మూలంగానే వైయస్ జగన్ అమరావతి ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించకుండా భయపడ్డారా అనే టాక్ ఇటీవల బయటపడింది.
దీంతో ఈ సందర్భంలో అమరావతిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బలమైన స్క్రిప్టుని ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లి ప్రచార కార్యక్రమంలో తనదైన శైలిలో చంద్రబాబు వ్యవహరిస్తే…అమరావతి ప్రాంతంలో స్థానిక సంస్థల ఎన్నికలు రెఫరెండం గా మారతాయని అంటున్నారు చాలామంది. దీంతో అమరావతిలో జరిగే లోకల్ బాడీ ఎలక్షన్ లో కచ్చితంగా తెలుగుదేశం పార్టీ అనుకూలమైన ఫలితాలు రాబట్టి గలిగితే క్లిక్ అయితే కనుక చంద్రబాబు ఒక విధంగా సక్సెస్ అయినట్టే అని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.