ఆ ముగ్గురుతో బీజేపీ వేట..సెట్ అవుతుందా?

-

తెలంగాణ బి‌జే‌పి ఇప్పుడుప్పుడే సెట్ అవుతుంది. కొన్ని మార్పుల తర్వాత పార్టీలో భారీగా కుదుపులు వచ్చాయి. ఎప్పుడైతే పార్టీ వెనుకబడిందో…అదే సమయంలో అధ్యక్ష స్థానాన్ని మార్చారు. బండి సంజయ్‌ని పక్కన పెట్టి కిషన్ రెడ్డిని అధ్యక్షుడుగా పెట్టారు. అలాగే ఈటల రాజేందర్‌కు ఎన్నికల నిర్వహణకమిటి ఛైర్మన్ పదవి ఇచ్చారు. అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి జాతీయ వర్గంలో చోటు ఇచ్చారు. ఇలా పలు కీలక పదవులు వచ్చాయి.

ఇక బండిని కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటారని తెలుస్తుంది. అటు తెలంగాణ నుంచి మరొకరిని రాజ్యసభకు పంపిస్తారని టాక్. ఇలా పదవులు ఇచ్చి తెలంగాణ బి‌జే‌పికి మళ్ళీ ఊపు తీసుకురావాలని కేంద్రం పెద్దలు ప్లాన్ చేస్తున్నారు. అలాగే పార్టీలో కీలకంగా ఉన్న ముగ్గురు నేతలు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, బండి సంజయ్‌లు రాష్ట్రం మొత్తం తిరిగేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. వారిని రాష్ట్రంలో పర్యటించేలా చేసి..పార్టీకి ఊపు తీసుకురావాలని చూస్తున్నారు.

అయితే పాదయాత్ర ద్వారా ముందుకెళ్తారా? లేక బస్సు యాత్ర చేస్తారా? అనేది క్లారితే లేదు గాని.ముగ్గురు నాయకులని మూడు దిక్కులకు పంపించాలని చూస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కిషన్ రెడ్డి పర్యటించేలా ప్లాన్ చేస్తున్నారట. ఇటు బండి సంజయ్‌ని ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో యాత్ర చేసేలా ప్లాన్ చేశారని తెలిసింది.

అలాగే ఈటలని ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో తిప్పాలని చూస్తున్నారట. ఇలా ముగ్గురు నేతలని రంగంలోకి దింపి..జిల్లాల పర్యటనకు పంపి పార్టీని బలోపేతం చేయాలనేది బి‌జే‌పి ప్లాన్ గా ఉంది. మరి ఈ ముగ్గురు నేతలు బి‌జే‌పిని ఎంతవరకు బలోపేతం చేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news