రాజకీయంలో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరని విషయాన్ని టిడిపి-బీజేపీ నాయకుల వ్యాఖ్యలను చూస్తే అర్ధమవుతుంది. కొన్ని నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ఒకరిని ఒకరు వ్యక్తిగత విషయాలతో సహా విమర్శించుకున్నారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో టిడిపి-బిజెపి నాయకుల మధ్య కొత్త మైత్రి ఏర్పడింది. 2019 ఎన్నికల్లో టిడిపి తమతో కలిసి పోటీ చేయలేదని బాధపడ్డ బిజెపి నాయకులు ఒక్క ఫోన్ కాల్ తో టిడిపితో మైత్రికి సిద్ధమయ్యారు. కరోనా విషయంపై చర్చించడానికి ప్రధాని మోది చంద్రబాబు నాయుడికి ఫోన్ సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ ఒక్క ఫోన్ కాల్ రాష్ట్రంలో ఒక రాజకీయ మార్పుకు నాంది పాలకబోతుందని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. 2019 ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బిజెపి, భవిష్యత్తులో టిడిపి, జనసేనాలతో కలిసి కొన్ని సీట్స్ అయిన గెలవడానికి ప్రయత్నం చేస్తుంది.
బిజెపి – టిడిపిల మధ్య ఏర్పడుతున్న మైత్రిపై జనసేన నాయకుడు ఎలా స్పందిస్తారోనని ప్రజలు వేచి చూస్తున్నారు. ఎందుకంటే గతంలో టిడిపితో పొత్తు లో ఉన్న పవన్ కళ్యాణ్ తరువాత టిడిపి విధానాలు నచ్చక విడిపోయిన విషయం తెలిసిందే.