చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత టిడిపి నేతలు ప్రజలకు దూరం గా ఉన్నారని చెప్పవచ్చు. చంద్రబాబు అరెస్ట్ ప్రజలలో సానుభూతిని పెంచిందని, టిడిపికి ఓట్లు పడతాయని టిడిపి నాయకులు, రాజకీయ వర్గాలు అందరూ అంటున్నారు. కానీ చంద్రబాబునాయుడు అరెస్టు తర్వాత టిడిపి ప్రజల ముందుకు వెళ్లి ఏ ఒక చిన్న కార్యక్రమం కూడా చేయలేదు. అరెస్టుకు సంబంధించి అరెస్టును నిరసిస్తూ నిరసనలు దీక్షలు చేస్తున్నారు. ఆ కార్యక్రమాలు టిడిపి పిలుపునిచ్చిన దీక్షలు, నిరసనలు కాబట్టి టిడిపి కార్యకర్తలు నేతలు చేస్తారు.
కానీ సామాన్య ప్రజలు వాటి జోలికి వెళ్లరు. అలాంటి దీక్షలను నిరసనలను పట్టించుకోవడానికి సామాన్యులకు సమయం ఉండదు. సామాన్య ప్రజల మద్దతు కావాలంటే కచ్చితంగా టిడిపి కీలక నాయకులలో ఒకరు అది చంద్రబాబు నాయుడు కుటుంబం నుంచైనా, సీనియర్ నాయకుల నుంచైనా ఎవరో ఒకరు చంద్రబాబు నాయుడు తరఫున రాష్ట్రం నలుమూలల పర్యటించాలి. ప్రజలందరి ముందుకు టిడిపిని తీసుకు వెళ్ళాలి.
లోకేష్ యువగళం పాదయాత్రను ఆపివేశారు. ఆ తర్వాత ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు లోకేష్‌కు కోర్టులు, లాయర్లు, కేంద్రంలో పెద్దలతో మాట్లాడడం ఈ విషయాల తోనే ఖాళీ లేకుండా ఉన్నారు. అలాంటప్పుడు లోకేష్ కి బదులుగా బ్రాహ్మణి గాని, భువనేశ్వరి గాని, బాలయ్యగాని ఎవరైనా ఒకరు ప్రజల ముందుకు పాదయాత్ర గాని బస్సుయాత్ర గాని చేసి టిడిపికి వైసిపి వల్ల జరిగిన అన్యాయాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని రాజకీయ వర్గాలు అంటున్నారు. మరి ఇప్పటికైనా టిడిపి నాయకులు ప్రజల ముందుకు వెళతారా లేదా చూడాలి.