మాజీలు కూడా వైసీపీలో, బీజేపీలో చేరతారా…? టీడీపీలో ఆందోళన…!

-

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఇప్పుడు అన్ని రకాలుగానూ ఇబ్బంది పడుతుంది. ఒక పక్క పార్టీ మారుతున్న వారిని ఆపలేక, మరో పక్క కార్యకర్తల్లో ధైర్యం నింపలేక చంద్రబాబు అన్ని రకాలుగానూ ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్క ఇసుక దీక్ష చేస్తుంటే… యువనేతల్లో కీలకంగా ఉన్న దేవినేని అవినాష్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు భారీగా దేవినేని అభిమానులు కూడా వైసీపీ లోకి వెళ్లిపోయారు. ఈ పరిణామం కొనసాగుతుండగానే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ తన నోటికి పని చెప్పి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.

లోకేష్ ని, చంద్రాబుని లక్ష్యంగా చేసుకుని ఆయన ఆరోపణలు చేయడం ఇప్పుడు కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు. ఇక ఇది పక్కన పెడితే… ఈ ఇద్దరి షాక్ నుంచి ఇంకా బయటకు రాకుండానే ఇప్పుడు మరిన్ని వార్తలు పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నాయి. మాజీ నేతలు కూడా పార్టీ మారే అవకాశం ఉందనే వార్తలు కలవరపెడుతున్నాయి. బోండా ఉమా, జలీల్ ఖాన్, ఉప్పులేటి కల్పన సహా కొందరు కీలక నేతలు పార్టీ మారే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే మాగంటి బాబు కూడా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం.

బోండా ఉమా పార్టీ కార్యాలాపాల్లో పాల్గొంటున్నా బిజెపిలోకి వెళ్లే సూచనలు ఉన్నాయని అంటున్నారు. ఇక జలీల్ ఖాన్… ఆయన కుమార్తె ఓటమి తర్వాత పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఎక్కడా కూడా పార్టీ సమావేశంలో ఆయన సందడి కనపడటం లేదు. ఇక ఉప్పులేటి కల్పన కూడా అంత హుషారుగా లేరనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. వీరందరూ కూడా వైసీపీ తీర్ధం పుచ్చుకునే సూచనలు ఉన్నాయనే వార్తలు కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నాయి. ఇక పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, బిజెపి ఎంపీ సుజనా చౌదరి తో చర్చలు జరుపుతున్నారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news