ఏదేమైనా టీడీపీ-జనసేన పార్టీల పొత్తు దాదాపు ఖాయమైందనే చెప్పొచ్చు…ఇప్పటికే చంద్రబాబు పొత్తు కోసం తెగ ఆరాటపడ్డారు..కాకపోతే పవన్ కల్యాణ్ నుంచి స్పందన రాకపోవడంతో..కాస్త పొత్తు అంశం పక్కకు వెళ్లింది…కానీ తాజాగా పవన్ సైతం పొత్తు విషయంలో క్లారిటీ ఇచ్చేసిన విషయం తెలిసిందే…వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చే ప్రసక్తి లేదని చెప్పి పవన్ చెప్పేశారు..దీని బట్టి టీడీపీ-జనసేన పార్టీల పొత్తు ఫిక్స్ అయిపోయినట్లే అని చెప్పొచ్చు.
ఇక రెండు పార్టీలతో బీజేపీ కలిసి వస్తుందా? లేదా? అనేది క్లారిటీ లేదు..సరే పొత్తు గాని ఫిక్స్ అయితే రాజకీయాలు ఎలా మారతాయి..పొత్తు వల్ల టీడీపీ-జనసేనలకు ఎంత లాభం..వైసీపీకి ఏమన్నా నష్టం కలుగుతుందా? అని విషయాలని ఒకసారి చూస్తే…ఖచ్చితంగా పొత్తు ఉంటే మాత్రం వైసీపీకి నష్టం జరగడం ఖాయమని చెప్పొచ్చు. వాస్తవానికి గత ఎన్నికల్లో పొత్తు లేకపోవడం వల్లే వైసీపీకి బాగా బెనిఫిట్ జరిగింది…ఒకవేళ అప్పుడే టీడీపీ-జనసేన పార్టీల పొత్తు ఉంటే రిజల్ట్ మారిపోయేది. ఇందులో ఎలాంటి అనుమానం అక్కరలేదు.
అందుకే ఈ సారి ఎలాగైనా వైసీపీకి చెక్ పెట్టాలని అటు టీడీపీ, ఇటు జనసేనలు చూస్తున్నాయి…ఈ సారి రెండు పార్టీలు కలిసి పోటీకి దిగడానికి రెడీ అవుతున్నాయి…రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే మాత్రం వైసీపీని ఓటమి అంచుకు తీసుకెళ్ళోచ్చనే విశ్లేషణలు వస్తున్నాయి..కేవలం పొత్తు ప్రభావంతో దాదాపు 60 సీట్లలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. అవి కూడా విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీ భారీగా సీట్లు లాస్ అవ్వొచ్చని తెలుస్తోంది.
ఇందులో ఏ మాత్రం డౌట్ లేదనే చెప్పొచ్చు..ఈ జిల్లాల్లోనే దాదాపు 50 సీట్లలో వైసీపీకి ఓటమి ఎదురు కావొచ్చని తెలుస్తోంది. అలాగే మిగిలిన జిల్లాల్లో కనీసం 20 సీట్లలో ప్రభావం ఉండొచ్చని అర్ధమవుతుంది. ఓవరాల్ గా టీడీపీ-జనసేన పొత్తు వల్ల వైసీపీ అధికారానికి దూరమయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.