పొత్తులో పవన్ భారీ ట్విస్ట్..అన్నీ ఆ సీట్లే తీసుకుంటున్నారు.!

-

తెలుగుదేశం-జనసేన పార్టీలు పొత్తు ఫిక్స్ అయిపోయిన విషయం తెలిసిందే. ఈ రెండు పార్టీలు రానున్న ఎన్నికల్లో కలిసి బరిలో దిగి వైసీపీకి చెక్ పెట్టాలని చూస్తున్నాయి. ఇక ఈ రెండు పార్టీలతో బి‌జే‌పి కలిస్తే కలవచ్చు..లేదంటే లేదు. చెప్పలేం. ఇక బి‌జే‌పి కలిసినా కలవకపోయినా టి‌డి‌పి, జనసేన పోయేది ఏమి లేదు. బి‌జే‌పి అంశం పక్కన పెడితే..టి‌డి‌పి-జనసేన పొత్తులో భాగంగా ఎవరికి ఎన్ని సీట్లు దక్కుతాయో అతి త్వరలోనే తేలిపోనుంది.

ఇక ఇందులో మెజారిటీ సీట్లు టి‌డి‌పికే దక్కుతాయి..జనసేనకు ఎన్ని సీట్లు వదులుతారు. అనేది క్లారిటీ లేదు. సరే ఏదేమైనా గాని రెండు పార్టీల పొత్తు అనేది ఫిక్స్. కాకపోతే పవన్ పొత్తులో ఒకటే కోరుకుంటున్నారు. ఎన్ని సీట్లు దక్కుతాయనేది పక్కన పెడితే..ఎన్ని సీట్లు దక్కిన గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నారు. అంటే పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు దక్కితే..అన్నీ సీట్లలో గెలవాలనేది పవన్ టార్గెట్.

ఉదాహరణకు 30 తీసుకుంటే 30..40 తీసుకుంటే 40 సీట్లు గెలవాలి. అయితే చంద్రబాబుని సైతం గెలిచే సీట్లే ఇవ్వాలని పవన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. అంటే జనసేన ఏ సీటులో పోటీ చేస్తే ఆ సీటులో గెలవాలి. అక్కడ జనసేన ఓట్లతో పాటు పూర్తిగా టి‌డి‌పి ఓట్లు సైతం పడాలి. అలా పడేలా ఇద్దరు నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే జనసేన కంటే టి‌డి‌పి ఓట్లే ఎక్కువ కాబట్టి..ఏదో ఐదారు స్థానాల్లోనే టి‌డి‌పి కంటే జనసేన ఓట్లు ఎక్కువ ఉంటాయి. మిగిలిన స్థానాల్లో టి‌డి‌పికి ఎక్కువ ఓటు బ్యాంకు ఉంటుంది.

అయితే టి‌డి‌పి ఓట్లు అన్నీ జనసేనకు పడేలా ప్లాన్ చేస్తున్నారు. అలాగే టి‌డి‌పి పోటీ చేసే చోట్ల కూడా జనసేన ఓట్లు పోకుండా చూసుకోవాలని పవన్‌కు బాబు సూచిస్తున్నారు. మొత్తానికైతే గెలిచే సీట్లనే పవన్ తీసుకుంటారు. అంటే ప్రతి సీటు గెలవడమే పవన్ టార్గెట్. అలాగే రెండు పార్టీల ఓటర్లు కలిసికట్టుగా పనిచేయాలి. అప్పుడే పొత్తు సఫలమవుతుంది..వైసీపీని ఓడించగలుగుతారు.

Read more RELATED
Recommended to you

Latest news