జగన్ కు యూరప్ లో సలహాదారుడు అవసరమా…?

సిఎం వైఎస్ జగన్ యూరప్ లో ఒక సలాదారుని నియమించుకున్నారని, రాష్ట్రం ఆర్ధికపరిస్ధితి అధోగతలో వున్నపుడు దుబారే ఖర్చుకాదా? అని టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. జగన్ కు క్రమశిక్షణ, పద్దతి లేదని ఆయన ఆరోపించారు. జగన్ తాను చేసిన అరచాకాలు మళ్లించడానికే మైండ్ గేమ్ ఆడుతున్నారని అన్నారు. ప్రధాని మోడీ మెడలు వంచుతామని జగన్ ప్రగల్భాలు పలికారని ఆయన ఎద్దేవా చేసారు.

ఇప్పుడు మోడీ కాళ్లు పట్టుకోడానికి సిద్దంగా వున్నారని అన్నారు. చట్టాలు, న్యాయస్ధానాలంటే జగన్ కు గౌరవం లేదని అన్నారు. అమరావతిలో జడ్జిలకు చంద్రబాబు ఇళ్ల స్ధలాలు కేటాయిస్తే దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని ఆయన విమర్శించారు. 2005 లో వైఎస్ సిఎమ్ గా వున్నపుడు హైదరాబాదులో న్యాయమూర్తులకు స్థలాలు ఇచ్చారని గుర్తు చేసారు. సీఎంగా ఉన్నపుడు మోదీ, కేసీఆర్ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చారని అన్నారు. అవి దురుద్దేశంతో ఇచ్చినట్లేనా? అని నిలదీశారు.