రాష్ట్రప్ర యోజనాలు, ప్రత్యేక హోదా, ఇతరత్రా అంశాల కోసం సిఎం జగన్ కేంద్ర మంత్రులను కలిశారా, లేక తన స్వప్రయోజనాల కోసమా? అని టీడీపీ సీనియర్ నేత బందరు సత్యనారాయణ మూర్తి ప్రశ్నించారు. జగన్ ఢిల్లీ పర్యటన రాష్ట్రం కోసమా… వ్యక్తిగతమా? అని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన వివరాలేమిటో ఆయనే ప్రజలకు తెలియచేయాలని అన్నారు.

బెయిల్ పై వచ్చి బయట తిరుగుతున్నవారు ఏ హోదాలో ఉన్నాకూడా, కేంద్రహోంమంత్రిని వ్యక్తిగతంగా కలవడం ఏమిటి? అని ప్రశ్నించారు. జగన్, అమిత్ షాను ఎందుకు కలిశాడో, ఏఏ అంశాలు చర్చించాడో హోంమంత్రి కార్యాలయం మీడియాకు వెల్లడించాలని కోరారు. తనపై ఉన్న కేసుల ఉచ్చు బిగుస్తున్నందునే, జగన్ కేంద్రపెద్దలను కలిసినట్లు ప్రజలంతా అనుకుంటున్నారని అన్నారు. తన బాబాయి హత్యకేసువిచారణ వేగంగా జరగకుండా చూడాలని కూడా ఆయన ఢిల్లీ పెద్దలను కోరాడని చెప్పుకుంటున్నారని ఆయన ఆరోపించారు.