ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం తార స్టయికి చేరుకుంది. అరెస్టులతో, నిరసనలతో రాష్ట్రం అట్టుడుకిపోతుంది. దీంతో టీడీపీ నాయకుల్లో కలవరం మొదలైంది. అసలు ఆ పార్టీలో ఉండేదేవరో, వీడేదవరో కూడా అర్ధం కాని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే రాష్ట్రంలో ఏర్పడిన తాజా పరిస్తితులపై టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. అధికార పక్షంపై విమర్శలు చేస్తూ రెచ్చిపోతున్నారు. తాజాగా వీరి జాబితాలోకి ఆ పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య కూడా చేరారు. వర్ల రామయ్య తన ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేసారు. “ముఖ్యమంత్రి గారు! ఏడాదిగా మీ పాలన కక్ష్య, పగ, ప్రతీకారంతో సాగుతున్నది. 2010లో మీపై హైకోర్టులో అక్రమాస్తుల కేసు వేసారని, ఆనాటి కాంగ్రెస్ దళిత మంత్రి శంకర రావు, తెలుగుదేశం పార్టీకి చెందిన ఎర్రం నాయుడు, అశోక్ గజపతిరాజు, బై రెడ్డి రాజశేఖరరెడ్డిలపై కక్ష్య సాధించడం ధర్మమా? న్యాయమా? అని ఆయన సీఎంను ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి గారు! ఏడాదిగా మీ పాలన కక్ష్య, పగ, ప్రతీకారంతో సాగుతున్నది. 2010లో మీపై హైకోర్టు లో అక్రమాస్తుల కేసువేసారని, ఆనాటి కాంగ్రెస్సు దళిత మంత్రి శంకర రావు, తెలుగుదేశం పార్టీకి చెందిన ఎర్రం నాయుడు, అశోక్ గజపతిరాజు, బై రెడ్డి రాజశేఖరరెడ్డిలపై కక్ష్య సాధించడం ధర్మమా? న్యాయమా?
— Varla Ramaiah (@VarlaRamaiah) June 15, 2020