శ‌నివారం వ‌స్తే షేక్ అవుతున్న టీడీపీ నేత‌లు.. మ‌రి కోర్టుకెందుకెళ్ల‌రు!

ఏపీలో ప్ర‌స్తుతం టీడీపీ నేత‌లు వ‌ణికిపోతున్నారు. ప్ర‌భుత్వం ఎప్పుడు ఎలాంటి యాక్ష‌న్ తీసుకుంటుందో అని టెన్ష‌న్ ప‌డుతున్నారు. ఇప్ప‌టికే అరెస్టుల పర్వంతో రాజ‌కీయాలు ఉడికిపోతున్నాయి. ఎప్పుడు ఎవ‌రి అరెస్టులు జ‌రుగుతాయో అని టీడీపీ నేత‌లు బిక్కుబిక్కుమంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు టీడీపీ నేత‌ల అక్ర‌మ క‌ట్ట‌డాల కూల్చివేత‌లు నిద్ర‌లేకుండా చేస్తున్నాయి.

 

TDP-Party | టీడీపీ

శ‌నివారం వ‌చ్చిందంటే చాలు ఎవ‌రి ఆక్ర‌మ‌ణ‌లు కూలుతాయో తెలియ‌కుండా ఉంది. శుక్ర‌వారం అర్థ‌రాత్రి దాటిన త‌ర్వా జేసీబీలు, బుల్డోజర్లతో స‌హా వ‌చ్చి కూల్చివేస్తున్నారు అధికారులు. దీంతో టీడీపీ నేత‌లు గ‌గ్గోలు పెడుతున్నారు. ఎప్పుడు ఎవ‌రి బిల్డింగులు కూలుతాయో తెల్వ‌కుండా ఉంది.

ఇప్ప‌టికే టీడీపీకి చెందిన గీతం విశ్వవిద్యాలయం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ అలాగే పల్లా శ్రీనివాస్ ల‌కు చెందిన బిల్డింగుల‌ను కూల్చివేశారు అధికారులు. వీరితోపాటు సబ్బంహరి, ఇత‌ర నేత‌ల‌ను చెందిన నిర్మాణాలను కూడా నేల‌మ‌ట్టం చేశారు. ఇక గ‌త రెండు రోజులుగా పల్లా శ్రీనవాసరావు బ్ర‌ద‌ర్ పల్లా శంకర్రావుకు చెందిన ప‌లు నిర్మాణాల‌ను అక్ర‌మ క‌ట్ట‌డాలంటూ అధికారులు కూల్చేయటం క‌ల‌క‌లం రేపింది. కానీ టీడీపీ నేత‌లు వీటిపై కోర్టుకు వెళ్ల‌కుండా కేవ‌లం గొడ‌వ‌కు దిగుతుండ‌టం గ‌మ‌నార్హం.