జగనన్న ప్రభుత్వం స్థానికసంస్థలకు నిధులివ్వకుండా వాటిని నిర్వీర్యం చేస్తోంది అని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య అన్నారు. 14, 15వ ఆర్థికసంఘం నిధులుగానీ, ఎన్ఆర్ఈజీఎస్, మైనింగ్ సెస్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చేఆదాయం మొత్తం డైరెక్ట్ గా సీఎఫ్ఎంఎస్ కే జమవుతోంది అని ఆరోపించారు. కనీసం పారిశుధ్యపనులు కూడా చేయలేని దుస్థితిలో స్థానికసంస్థలున్నాయి అని మండిపడ్డారు.
ఎన్ ఆర్ఈజీఎస్ కు చెందిన రూ.2,200కోట్లను నిలిపేశారు అని అన్నారు. ఆర్థిక నేరగాడి ప్రభుత్వం నీతివాక్యాలకే పరిమితమైంది తప్ప, అవినీతిపరులపై చర్యలు తీసుకోవడంలేదని ఆయన ఎద్దేవా చేసారు. కాకినాడ్ సెజ్, విశాఖ బేపార్క్ లు హెటిరో, అరబిందోకు అప్పగించడం మరో క్విడ్ ప్రోకో విధానంలో భాగమే అని అన్నారు. తనబాబు సొమ్మేదో ఇచ్చినట్లు పాఠ్యపుస్తకాలకు పార్టీ రంగులేయడం ఏమిటి? అని ప్రశ్నించారు. రాజకీయనేతలపై ఉన్న అవినీతికేసుల విచారణ వేగవంతం కావడం శుభపరిణామం అని అన్నారు.