రేవంత్ రెడ్డికి ప్లస్ అవుతున్న టీడీపీ..టర్న్ అయినట్లేనా…!

-

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) కి, టీడీపీతో ఎలాంటి అనుభంధం ఉందో అందరికీ తెలిసిందే. దాదాపు పదేళ్ళ పాటు రేవంత్ ఆ పార్టీలో పనిచేశారు. ఆ పార్టీలోనే కీలక నాయకుడుగా ఎదిగి, మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. రేవంత్‌కు చంద్రబాబు ఎలాంటి సపోర్ట్ ఇచ్చారో కూడా అందరికీ తెలిసిందే. అయితే తెలంగాణలో టీడీపీకి అనుకూల పరిస్తితులు లేని కారణంగా రేవంత్, గౌరవంగా ఆ పార్టీ నుంచి బయటకొచ్చి కాంగ్రెస్‌లో చేరి, ఇప్పుడు పీసీసీ స్థాయికి ఎదిగారు.

రేవంత్ రెడ్డి | Revanth Reddy
రేవంత్ రెడ్డి | Revanth Reddy

అయితే అందరి నాయకుల మాదిరిగా టీడీపీని వీడాక రేవంత్, చంద్రబాబుపై విమర్శలు చేయలేదు. అలాగే పలు సందర్భాల్లో చంద్రబాబు మీద ఉన్న గౌరవాన్ని చూపించేవారు. ఇలా బాబు పట్ల గౌరవంతో ఉండటంతో రేవంత్‌ని రెండు రాష్ట్రాల్లో ఉన్న టీడీపీ క్యాడర్ సైతం అభిమానిస్తుంది. ఇప్పుడు అదే టీడీపీ క్యాడర్ రేవంత్‌కు ప్లస్ కానుందని తెలుస్తోంది.

తెలంగాణలో టీడీపీకి అనుకూల పరిస్తితులు లేకపోవడంతో క్యాడర్ సైతం ఇతర పార్టీల వైపుకు వెళ్లిపోయింది. కొంత క్యాడర్ రేవంత్‌తో పాటే కాంగ్రెస్‌లోకి వచ్చిందిగానీ, మెజారిటీ టీడీపీ క్యాడర్ టీఆర్ఎస్ వైపుకు వెళ్ళిన విషయం తెలిసిందే. ఇక ఆ క్యాడర్ కొంతవరకు రేవంత్‌ వైపుకు వచ్చేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది.

ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి ఖమ్మం జిల్లాల్లో టీడీపీ క్యాడర్ టీఆర్ఎస్ వైపుకు వెళ్లింది. ఆ క్యాడర్ ఇప్పుడు నిదానంగా రేవంత్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్‌లో కూడా టీడీపీకి తెలంగాణలో పుంజుకునే పరిస్తితి కనిపించకపోవడం, రేవంత్ రెడ్డికి పీసీసీ రావడంతో కొంత టీడీపీ క్యాడర్, ఆయనకు మద్ధతుగా నిలబడటానికి సిద్ధమవుతుందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news