కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి మార్క్‌… అలా అయితేనే పార్టీలోకి రావాలంట‌..!

కాంగ్రెస్‌లో పార్టీలో క‌నిపిస్తున్న ఊపుతో రేవంత్ రెడ్డి revanth reddy త‌న మార్కును చూపించేందుకు రెడీ అయ్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం కాంగ్రెస్ నుంచి వీడి పోయిన వారే త‌ప్ప కాంగ్రెస్ లోకి వ‌చ్చిన వారెవ‌రూ లేక‌పోవ‌డంతో ఆ పార్టీని ప‌ట్టించుకునే వారే క‌రువ‌య్యారు. ఇక లాభం లేద‌ని రేవంత్ ను ప్రెసిడెంట్ గా చేయ‌డంతో జోష్ పెరిగింది. దీంతో పాత నేత‌లంద‌రూ మ‌ళ్లీ కాంగ్ర‌స్ లోకి వ‌చ్చేందుకు రెడీ అయ్యారు. అయితే ఇక్క‌డే రేవంత్ ఓ ఫిట్టింగ్ పెడుతున్నారు.

రేవంత్ రెడ్డి | Revanth Reddy
రేవంత్ రెడ్డి | Revanth Reddy

ఎందుకంటే రీసెంట్ గా ధ‌ర్మపురి సంజ‌య్ కాంగ్రెస్ లో చేర‌డంతో అక్క‌డి జిల్లాలోని స్థానిక నేత‌లంద‌రూ చాలా తీవ్రంగా వ్య‌తిరేకించారు. దీంతో ఈ విష‌యం కాస్త రేవంత్ దాకా వెళ్లింది. కార్య‌క‌ర్త‌లు వ్య‌తిరేకిస్తే పార్టీకి చాలా తీవ్ర న‌ష్టం జ‌రుగుతుంద‌ని రేవంత్ భావించి ఇక‌పై చేరేవారి విష‌యంలో కొత్త నిర్ణ‌యం తీసుకున్నారు. కొత్త‌గా చేరేవారిని పూర్తిగా ప‌రిశీలించేందుకు ఓ క‌మిటీని కూడా వేశారు.

పీసీసీ నేతృత్వంలో ఒక క‌మిటీని వేసింది. ఈ క‌మిటీ పార్టీలోకి రావాల‌నుకుంటున్న వారిపై బ‌యోగ్ర‌ఫీని ప‌రిశీలించి వారికి ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ఎలాంటి వ్య‌తిరేక‌త లేక‌పోతేనే పార్టీలోకి ఆహ్వానిస్తారంట‌. అంటే ఆ నేత‌కు స్థానికంగా కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల మ‌ద్ద‌తు ఉంటేనే రానిస్తామ‌ని చెబుతున్నారు. అయితే ఇది పార్టీలోకి రావాల‌నుకుంటున్న వారికి ఇబ్బందిని తెస్తుంద‌ని అంతా అనుకుంటున్నారు. చూడాలి మ‌రి రేవంత్ ప్లాన్ ఏ మేరకు స‌క్సెస్ అవుతుందో.