వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఒకపక్క ప్రజలకు సంక్షేమ వరాలు కురిపిస్తూ, మరోపక్క రాష్ట్రంలో తనకు ప్రత్యర్థి లేకుండా సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి 23 మంది శాసనసభ్యులు ఉండటం జరిగింది. వారిలో ఇద్దరు ఇప్పటికే చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడి, బహిరంగంగానే టిడిపికి గుడ్ బై చెప్పినట్టు వ్యవహరించడం జరిగింది. ఇటువంటి తరుణంలో అటు ఇటు కాని, బలం లేని ప్రతిపక్షంగా టిడిపి పరిస్థితి మారింది. మరోపక్క ఇదే టైమ్ అనుకున్నారో ఏమోగానీ జగన్ అసెంబ్లీలో అమలు చేస్తున్న ప్రతి ప్రభుత్వం బిల్లును మండలిలో తన బలం ఉండటంతో చంద్రబాబు అదే పనిగా అడ్డుపడటం జరిగింది. దీంతో ఇటీవల శాసనమండలిని జగన్ ప్రభుత్వం రద్దు చేసి ఆ బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ఆమోదిస్తే రాష్ట్రంలో శాసన మండలి రద్దు అవుతుంది. ఇదే తరుణంలో త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ నీ సమావేశాలకు ముందు ప్రభుత్వం ఆహ్వానించడం జరుగుతుంది. ఈ సందర్భంగా గవర్నర్ శాసనమండలి ఉద్దేశించి మాట్లాడకుండా కేవలం అసెంబ్లీ సమావేశాలను ఉద్దేశించి మాట్లాడితే మాత్రం…మండలిలో బలం ఉంది కదా అని ఎగురుతున్న టిడిపి ఆఫీస్ కి ఇక తాళం పడిపోయినట్లే అని, అసెంబ్లీ లో జగన్ ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.