ఆ జిల్లాల్లో మార్పు…జగన్ జాగ్రత్త పడాల్సిందేనా!

-

ఏపీలో జగన్‌ కు తిరుగులేని బలం ఉంది..అందులో ఎలాంటి డౌట్ లేదు…ఆ జిల్లా, ఈ జిల్లా అనే తేడా లేకుండా ప్రతి జిల్లాలోనూ వైసీపీ హవా ఉంది. గత ఎన్నికల్లో అన్నీ జిల్లాల్లో వైసీపీ ఆధిక్యం సాధించి అధికారంలోకి వచ్చింది…ఇప్పటికీ అదే పరిస్తితి ఉంది. 13 జిల్లాల్లోనూ వైసీపీ హవా ఉంది. కాకపోతే కొన్ని జిల్లాల్లో చిన్న తేడా కనిపిస్తోంది. వైసీపీకే ఆధిక్యం ఉన్నా సరే కొన్ని జిల్లాల్లో టీడీపీ పికప్ అవుతున్నట్లు కనిపిస్తోంది.

jagan
jagan

ఏడు నెలల క్రితం జరిగిన పంచాయితీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ దాదాపు క్లీన్‌స్వీప్ చేసినంత పనిచేసింది. ఇక టీడీపీ ఎక్కడా కూడా పోటీ ఇవ్వలేకపోయింది. కనీసం పరువు దక్కించుకునే స్థాయిలో గెలవలేదు. వైసీపీ అధికార బలాన్ని ఉపయోగించుకున్నా సరే, పజల మద్ధతు కూడా బాగానే పొందారు. కానీ టీడీపీకి ప్రజా మద్ధతు పొందలేదు. అయితే తాజాగా జరిగిన మినీ మున్సిపల్, పంచాయితీ ఎన్నికల్లో కాస్త పరిస్తితి మారినట్లు కనిపిస్తోంది.

ఇప్పుడు కూడా వైసీపీనే ఆధిక్యం దక్కించుకుంది. కానీ కొన్ని చోట్ల టీడీపీ గట్టి పోటీ ఇచ్చింది. వైసీపీకి ధీటుగా వచ్చింది. అలాగే కొన్ని చోట్ల గెలిచింది. ఈ మార్పు కాస్త కనబడుతోంది. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో మార్పు ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే రాయలసీమలో అనంతపురం జిల్లాలో కూడా కాస్త పరిస్తితి మారింది.

అయితే కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పూర్తిగా వైసీపీ ఆధిక్యమే ఉంది. అయితే కోస్తా జిల్లాల్లో కూడా వైసీపీ ఆధిక్యం ఉంది…కానీ టీడీపీ పుంజుకుంది. ఉత్తరాంధ్రలో కూడా కాస్త మార్పు కనిపిస్తోంది. ఈ మార్పు ఇలాగే కొనసాగితే వైసీపీకి ఇబ్బంది అవుతుంది. ఇప్పటినుంచే జగన్ జాగ్రత్త పడాల్సి ఉంది. ఎందుకంటే 2014 ఎన్నికల్లో కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాలే జగన్ కొంపముంచాయి. కాబట్టి ఇకనైనా జాగ్రత్త పడితే వచ్చే ఎన్నికల్లో మరొకసారి సత్తా చాటి అధికారంలోకి రావొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news