చంద్రబాబుకు గత నాలుగున్నరేళ్లలో ఏపీకి ప్రత్యేక హోదా గుర్తుకురాలేదు. ఎన్నికలు రెండు మూడు నెలలు ఉండగానే అన్నీ గుర్తొస్తాయి ఈయనకు. ఇప్పుడు ప్రత్యేక హోదా మీద పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక హోదా కోసం ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టిన చంద్రబాబు.. తాజాగా న్యూఢిల్లీలోనే ధర్మపోరాట దీక్ష పేరుతో నిరసన కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించారు. అయితే.. ఢిల్లీలో సీఎం చంద్రబాబు చేపట్టిన దీక్షకు ఏపీ ప్రభుత్వం భారీగానే డబ్బులు ఖర్చు చేస్తోందట. ముఖ్యమంత్రి, ఆయన దీక్షకు మద్దతు పలకడానికి వచ్చిన వాళ్లందరికీ ఖరీదైన హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. అంతే కాదు.. ఆంధ్రా నుంచి.. ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి దీక్షకు వచ్చిన వాళ్లందరికీ ప్రభుత్వ ఖర్చుతోనే విమాన టికెట్లు కొనుగోలు చేశారు. ప్రత్యేక రైళ్లను కూడా వేశారు. దానికి 1.12 కోట్ల రూపాయలు చెల్లించారు.
3500 మందికి ఏసీ హోటళ్లలో వసతి సదుపాయలు, దీక్షలో ఖర్చులు, ఫుడ్డు, రానుపోను ఖర్చులు.. ఇలా అన్నీ కలిపితే 10 కోట్లకు పైనే నట. ఏపీ ప్రభుత్వం తరుపున వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు, నాయకులకు ఫైవ్ స్టార్ హోటళ్లలో వసతులు ఏర్పాటు చేశారు. ఇలా అన్నింటికీ కలిపి 10 కోట్లు ఖర్చు పెడుతుండటంతో ఏపీ ప్రభుత్వంపై విమర్శలు ఏపీ ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. వామ్మో.. ఒక దీక్షకు 10 కోట్లు ఖర్చు పెడితే.. ఇంకో దీక్ష చేస్తే దానికి ఎంత ఖర్చు పెడతారు.. ఇలా అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టే బదులు వాటిని ఏపీ అభివృద్ధి కోసం వినియోగించవచ్చు కదా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.