త్వరలో 33 జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలు: కేసీఆర్

-

రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఎంబీబీఎస్​ సీట్లను 6500కు పెంచుతున్నట్లు తెలిపారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు మాత్రమే ఉన్న ప్రభుత్వ రంగ వైద్య కళాశాలలు, ఇప్పుడు ఆ సంఖ్య 17కు చేరిందని వెల్లడించారు. దేశంలోనే అనేక రంగాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని సీఎం పేర్కొన్నారు. తాను ఉద్యమం ప్రారంభించినప్పుడు పుట్టిన పిల్లలకు ఇప్పుడు ఫలాలు అందుతున్నాయని అన్నారు.

వరంగల్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ములుగు రోడ్డులో ఉన్న దామెర క్రాస్ రోడ్డు వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 350 పడకలతో నిర్మించిన ప్రతిమ రిలీఫ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ క్యాన్సర్ ఆసుపత్రిని, వైద్య కళాశాలను సీఎం ప్రారంభించారు. కళాశాల ప్రారంభించడం వల్ల అందుబాటులోకి మరో 150 ఎంబీబీఎస్​ సీట్లు వచ్చాయని వెల్లడించారు. ఇక్కడ ఆసుపత్రి ప్రారంభించడం.. వరంగల్​ ప్రజలకు శుభపరిణామంగా చెప్పవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. వైద్య విద్య కోసం మన విద్యార్థులు ఇంక ఉక్రెయిన్ వంటి దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్​ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news