కార్పొరేషన్‌ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్‌ సరికొత్త వ్యూహాలు

Join Our Community
follow manalokam on social media

కార్పొరేషన్‌ ఎన్నికల్లో గెలుపు కోసం తెలంగాణ కాంగ్రెస్ సరికొత్త ప్యూహాలతో సిద్దమవుతుంది. కార్పొరేషన్‌ ఎన్నికల్లో గెలుపు కోసం అస్త్రాలు సిద్ధం చేసుకుంటూనే…మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా రైతు సమస్యలపై పోరాటం చేయాలని డిసైడ్‌ అయింది. ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల కోసం బూత్‌ స్థాయిలో కమిటీలు నియమించింది. దీన్ని రోల్ మోడల్ గా అన్ని జిల్లా డీసీసీ అధ్యక్షులకు విధివిధానాలను వివరించింది.

వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించాలని తొలుత తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ ఠాగూర్ భావించారు. అయితే పార్లమెంట్ సమావేశాలు ఉండటంతో ఇది వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం మిర్యాలగూడలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ నిర్వహించాలని చూశారు. దీన్ని కూడా రద్దు చేసుకుంది పార్టీ. నిజామాబాద్‌ జిల్లాలో రేవంత్‌ రెడ్డి చేపట్టిన…రైతు దీక్షలు సక్సెస్‌ అయ్యాయి. దీంతో ఉమ్మడి పాలమూరులో జిల్లాలోని అచ్చంపేట వేదికగా రైతు దీక్ష చేపట్టారు రేవంత్.

ఖమ్మం జిల్లాలో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తొంది. డిసిసి అద్యక్షుల సమావేశానికి ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్‌తో పాటు, పిసిసి అధ్యక్షులు ఉత్తమ్, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు హాజరయ్యారు. 33 జిల్లాల నుంచి డిసిసి అద్యక్షులు తరలివచ్చారు. ఈ సమావేశంలో బయటి వారు లేకుండా జాగ్రత్త పడ్డారు.

తెలంగాణ కాంగ్రెస్ బూత్ కమిటీలపై దృష్టి సారించింది. వైఫల్యాల నుంచి పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే కమిటీల ద్వారానే సాధ్యమని గుర్తించింది. అందుకు అనుగుణంగానే నాయకత్వం వ్యవహారాలు మారనున్నాయి. ఇప్పటి వరకు అనుసరించిన వైఖరి కాకుండా ప్రజలకు చేరువ కావాలని ప్లాన్ చేస్తున్నారు. పార్టీ ఫిరాయించిన వారిని దూరం పెడుతూనే…కార్యకర్తలకు మనో ధైర్యం ఇవ్వాలని నిర్ణయించారు.

వరుస పరాజయాల తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టింది తెలంగాణ కాంగ్రెస్. పార్టీ ఫిరాయించిన వారిని తిరిగి చేర్చుకోబోమన్నారు ఠాగూర్. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందన్న విశ్వాసాన్ని కార్యకర్తలకు అందించే ప్రయత్నం చేశారు. బూత్ కమిటీల నేతలతో నేరుగా మాట్లాడారు. ఈ తరహా ఇప్పటివరకు ఏ నేత కూడ చేయలేదనే అభిప్రాయం పార్టీనేతల నుంచి వ్యక్తమవుతోంది.

TOP STORIES

నీ లోపలి బాధలే కాదు, నీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే అలాగే మిగిలిపోతావని తెలిపే కథ..

ఒక కొండమీద నివాసముండే అమ్మాయి నీళ్ళకోసం కొండదిగి నది వద్దకు వస్తూంటుంది. భుజం మీద కావిడి పట్టుకుని రెండు కుండల్లో నీళ్ళు పట్టుకుని కొండమీదకి వెళ్తుండేది....