జంట కమిషనరేట్ల పరిధిలో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు వివరాలను సిట్‌కు అందివ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా తెలంగాణ డీజీపీ కార్యాలయంలోనే సిట్‌కు ప్రత్యేక చాంబర్‌ను కేటాయించారు.
సేవా మిత్ర యాప్‌తో టీడీపీ ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసిందనే ఫిర్యాదు నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన విషయం విదితమే. కాగా ఈ నేరానికి పాల్పడిన వారు ఎంతటి వారైనా సరే విడిచిపెట్టబోమని ఇప్పటికే పోలీసులు తెలిపారు. అయితే ఈ కేసును తెలంగాణ ప్రభుత్వం ఇవాళ సిట్ కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో టీడీపీ డేటా చోరీ కేసును ఇకపై ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) విచారించనుంది.
కాగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌కు ఇన్‌చార్జిగా వెస్ట్‌జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర వ్యవహరించనున్నారు. అలాగే సిట్ బృందంలో సైబర్ క్రైమ్స్ డీసీపీ రోహిణి, కామారెడ్డి ఎస్పీ శ్వేతా రెడ్డి, నారాయణ పేట ఎస్‌డీపీవో శ్రీధర్, సైబర్ క్రైం డీఎస్పీ రవికుమార్ రెడ్డి, మాదాపూర్ ఏసీపీ శ్యాం ప్రసాద్ రావు, సైబరాబాద్ క్రైం ఏసీపీ శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్లు రమేష్, వెంకట్రామిరెడ్డిలు సభ్యులుగా ఉంటారు. ఈ క్రమంలో జంట కమిషనరేట్ల పరిధిలో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు వివరాలను సిట్‌కు అందివ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా తెలంగాణ డీజీపీ కార్యాలయంలోనే సిట్‌కు ప్రత్యేక చాంబర్‌ను కేటాయించారు.
మరోవైపు ఏపీ ప్రతిపక్ష నేత జగన్ కూడా ఇవాళ గవర్నర్ నరసింహన్‌ను కలిసి టీడీపీ డేటా చోరీ అంశంపై కలగజేసుకోవాలని, నేరానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అలాగే ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా గవర్నర్‌ను కలసి చంద్రబాబు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని కోరారు. దీంతో గవర్నర్ నరసింహన్ ఈ విషయంపై ఎలా స్పందిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.