రాయచోటిలో తెలుగుదేశం పార్టీ ఖాళీ.. అధినేతపై తిరుగుబాటుకు సిద్ధమైన ఇంచార్జ్..

-

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి జాబితాన్ని ఏం ముహూర్తం ప్రకటించారో గాని.. ఆయనకు పార్టీ నేతల నుంచి ఆందోళనలు, నిరసనలు, అసంతృప్తులు ఎదురవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు చంద్రబాబు దేవుడంటూ వ్యాఖ్యానించిన నేతలందరూ తెగ తిట్టేస్తున్నారు.. ముఖ్యంగా రాయిచోటి నియోజకవర్గంలో ఈ అసంతృప్తులు కాస్త ఎక్కువగా ఉన్నాయి..

అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లో టిడిపిని ఇంచార్జ్ రమేష్ రెడ్డి కాస్తో కూస్తో బలోపేతం చేశారు. పోగేసిన డబ్బులన్నీ పార్టీ కార్యక్రమాలకు ఖర్చు పెట్టారు. వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ వస్తుందంటూ ప్రచారాలు కూడా ప్రారంభించారు.. అయితే ఆ నియోజకవర్గ టికెట్ ను చంద్రబాబు రాంప్రసాద్ రెడ్డికి కేటాయించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికంగా బలవంతుడిగా ఉన్న రాంప్రసాద్ రెడ్డికి టికెట్ కేటాయించడంపై.. రమేష్ రెడ్డి వర్గీయులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట. నమ్మించి చంద్రబాబు గొంతు కోశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి..

రమేష్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోవడంతో నియోజకవర్గంలోని కీలక నేతలు, ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారని రాయచోటి నియోజకవర్గం లో టాక్ వినిపిస్తోంది. పార్టీకి కోట్ల రూపాయలు ఫండ్ ఇచ్చి రాంప్రసాద్ రెడ్డి టికెట్ తెచ్చుకున్నారని.. డబ్బున్నోళ్లకే చంద్రబాబు టికెట్ ఇస్తారంటూ సొంత పార్టీ నేతలు చంద్రబాబు తీరుపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.. నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేసిన రమేష్ రెడ్డి అయితే ఒక అడుగు ముందుకేసి మరి.. నియోజకవర్గంలో టిడిపి ఎలా గెలుస్తుందో చూస్తాను అంటూ తన అనుచరుల వద్ద సవాళ్లు విసురుతున్నారట.. ఇంత వ్యతిరేకత ఉన్న రాంప్రసాద్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తారు మరి..

Read more RELATED
Recommended to you

Latest news