కారుని వణికిస్తున్న కమలం-కాంగ్రెస్…షాక్ ఫిక్స్?

-

తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్‌కు బలం ఉన్నా సరే భయపడాల్సిన పరిస్తితి వచ్చింది. స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు అన్నీ స్థానాల్లో గెలిచే సత్తా ఉంది. అసలు 12 స్థానాలు ఏకగ్రీవం అయిపోతాయని ఆ పార్టీ భావించింది. కానీ ఊహించని విధంగా 6 చోట్ల ఏకగ్రీవమైతే…6 చోట్ల ఎన్నికలు జరగాల్సిన పరిస్తితి వచ్చింది. రెండు చోట్ల ఈటల రాజేందర్ మద్ధతుతో స్వతంత్ర అభ్యర్ధులు బరిలో నిలిచారు.

congress-party-bjp-partyఎన్నికల్లో బలం లేకపోవడంతో బీజేపీ పోటీ చేయకూడదని నిర్ణయించుకుంది. కానీ ఈటల మాత్రం…టీఆర్ఎస్‌కు ఓటమి భయం ఎలా ఉంటుందో మళ్ళీ చూపించాలని చెప్పి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో స్వతంత్ర అభ్యర్ధులకు మద్ధతు ఇస్తున్నారు. అసలు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు 10 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా ఎల్‌.రమణ, టి.భానుప్రసాద్‌రావు, స్వతంత్ర అభ్యర్థులుగా మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌తోపాటు మరో ఏడుగురు ఉన్నారు.

అయితే రవీందర్ సింగ్…టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు. రవీందర్‌సింగ్‌కు ఈటల మద్ధతు ఉంది. అలాగే ఆయనకు బీజేపీతో పాటు కొందరు టీఆర్‌ఎస్‌ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల మద్ధతు ఉంది. అటు ఆదిలాబాద్‌లో ఈటల మద్ధతుతో స్వతంత్ర అభ్యర్థి పెందూర్‌ పుష్పరాణి బరిలో నిలిచారు. ఇక ఖమ్మం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తాతా మధుసూదన్‌, కాంగ్రెస్‌ తరఫున రాయల నాగేశ్వర్‌రావు, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నల్లగొండ జిల్లాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డికి పోటీగా…ఆరుగురు స్వతంత్ర అభ్యర్ధులు పోటీలో దిగారు. ఇందులో కుడుదుల నగేష్‌కు రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉండగా, వంగూరి లక్ష్మయ్యకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సపోర్ట్ ఉంది. అటు మెదక్‌లో టీఆర్ఎస్‌కు పోటీగా జగ్గారెడ్డి భార్య నిర్మలా పోటీలో దిగారు. ఇలా ఆరు చోట్ల టీఆర్ఎస్‌కు పోటీగా కాంగ్రెస్, కమలం పార్టీలు బరిలో దిగాయి. అయితే గెలిచినా, ఓడినా కాంగ్రెస్, కమలం పార్టీలు కారు పార్టీని వణికించేలా ఉన్నాయి. వీటిల్లో ఒక్కటి ఓడిపోయినా కారుకు డ్యామేజ్ జరిగినట్లే.

Read more RELATED
Recommended to you

Latest news