గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల్లో కొన్ని కొన్ని వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ప్రధానంగా కొన్ని కొన్ని డివిజన్ లలో ఓట్ల లెక్కింపు విషయంలో తీవ్ర స్థాయిలో బిజెపి ఆరోపణలు చేసింది. ఇక తాజాగా ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నేరెడ్ మేట్ లో ఓట్ల లెక్కింపు విషయంలో హైకోర్ట్ కీలక తీర్పు ఇచ్చింది. ఇతర గుర్తుతో ఉన్న ఓట్లను కూడా లెక్కించాలి అని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది.
తెరాస అభ్యర్ధి 500 పై చిలుకు ఓట్లతో విజయం సాధించగా 544 ఓట్లు ఇతర గుర్తు తో ఉన్నాయి. వాటిని కూడా లెక్కించాలి అని ఎన్నికల సంఘానికి హైకోర్ట్ అనుమతి ఇచ్చింది. దీనితో ఈ డివిజన్ ఫలితం విషయంలో అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు.