ఇలాంటి టైమ్ లోనే అసలు ‘నాయకులు’ కనిపిస్తున్నారు !

-

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న టైమ్ లోనే రాష్ట్రంలో మద్యపానం లేకుండా చేస్తానని మహిళలకు హామీ ఇవ్వడం జరిగింది. ఇదే విషయాన్ని ప్రజా సంకల్ప పాదయాత్రలో అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో పదేపదే చెప్పారు. అందరూ అనుకున్నట్టుగానే అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మద్యపాన నిషేధం విషయంలో మాట ఇచ్చినట్టుగానే వ్యవహరించారు. ముందుగా గ్రామాల్లో ఉన్న బెల్టుషాపులను తొలగించిన వైయస్ జగన్ తర్వాత మద్యపానాన్ని ప్రభుత్వం నడిపే విధంగా చర్యలు చేపట్టారు. ప్రతి చోటా బ్రాందీ షాపులు లేకుండా మద్యపానం కొనడానికి భయపడే విధంగా రేటు షాక్ కొట్టే విధంగా పెంచేశారు.YCP MLA Vidadala Rajini Angry on Excise Department Head Constable ...దీంతో చాలావరకు మందుబాబులు మద్యపానాన్ని మానేయడం జరిగింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో అని షాపు లతోపాటు మద్యపాన షాపులు కూడా క్లోజ్ అయిపోయాయి. ఇటువంటి తరుణంలో మద్యపానాన్ని చాలా కట్టడి చేయడానికి చర్యలు తీసుకుంటున్న సమయంలో చిలకల్లూరి పేట నియోజకవర్గంలో ఎక్సయిజ్ హెడ్ కానిస్టేబుల్ చేసిన దందా ఆడియో రూపంలో ఎమ్యెల్యే విడదల రజని చేతికి చిక్కింది. దాంతో ఎమ్యెల్యే నేరుగా ఎక్సయిజ్ స్టేషన్ కి వెళ్లి సదరు కానిస్టేబుల్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆశించింది ఏమిటి మీరు చేస్తుంది ఏమిటి అంటూ రఫ్ ఆడించారు.

 

అక్రమంగా బ్లాక్ లో మద్యపానాన్ని అమ్ముతున్న వారి దగ్గర నుండి లంచం తీసుకోవడం అదే టైమ్ లో కొన్ని లావాదేవి విషయంలో అమ్మే వ్యక్తి నుండి ఎక్సైజ్ కానిస్టేబుల్ కి రావాల్సిన డబ్బులు తీసుకోవడం అస్సలు మీరు డ్యూటీ చేస్తున్నారా లేకపోతే మందు అమ్ముకుంటున్నారా అన్నట్టుగా నిలదీశారు. ఈ విషయంలో హెడ్ కానిస్టేబుల్ గట్టిగా డిమాండ్ చేస్తున్న ఆడియో ఎమ్మెల్యే రజిని చేతికి రావడంతో విషయం పై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారులకు స్పాట్ లోనే రజని ఆదేశించారు. హెడ్ కానిస్టేబుల్ కి రజిని వార్నింగ్ ఇస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావటంతో చాలా మంది నెటిజన్లు ఇటువంటి టైమ్ లోనే అసలైన నాయకులు కనిపిస్తారని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మద్యపానం నిషేధం అమలు చేస్తుంటే ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ విధంగా వ్యవహరించడం చాలా సిగ్గుచేటు అంటూ మరి కొంత మంది విమర్శలు చేస్తున్నారు. సదరు ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ నీ సస్పెండ్ చేయాలని చాలామంది కోరుతున్నారు.  

Read more RELATED
Recommended to you

Latest news