ఫ్యూచర్ ఉంది.. ఫ్రూఫ్ ఇదిగో: బీజేపీతో జతకట్టాక పవన్ ముదిరిపోయాడు!

-

ఏపీ పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దుబిల్లును ఆమోదించవద్దంటూ ఏపీ గవర్నర్ కు ఏపీ బీజేపీ అధ్యక్షుడి హోదాలో కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. పరిపాలన వికేంద్రీకరణకు వీలుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యం కాదని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ లేఖపై ఏపీ బీజేపీలో పెద్ద దుమారమే లేచింది. ఏపీలో టీడీపీ అనుబంధ సంస్థగా ఏపీ బీజేపీని నడిపిస్తున్నారంటూ బీజేపీ కార్యకర్తల నుంచి విమర్శలు పెరిగిపోతున్నాయి!

ఏపీ పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు విషయంలో “ఏపీ బీజేపీ” మాట అలా ఉంటే… హాస్తినలోని “బీజేపీ పెద్దలు” మాత్రం… రాజధాని విషయం పూర్తిగా అ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది.. అందులో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదు అని చెబుతున్నారు. ఈ రెండు కళ్ల సిద్ధాంతంతో ఏపీ ప్రజలకూ కూడా ఒక క్లారిటీ లేక జుట్టుపట్టుకుంటుంటే… ఈ విషయంలో.. బీజేపీలో ఉంటూ చంద్రబాబు క్షేమం కోరే టీం లో వన్ ఆఫ్ ది మెంబర్ గా పేరు సంపాదించుకున్న దినకర్ తాజాగా స్పందించారు!

“భారతదేశం మొత్తం ఒకటే భారతీయ జనతాపార్టీ” అంటూనే రాష్ట్రంలోని బీజేపీ తరుపున కన్నా లక్ష్మీనారాయణ లేఖలో కనిపించిందే పార్టీ విధానం అని చెప్పుకొచ్చారు! ఈ లెక్కన చూసుకున్నా… దినకర్ చెబుతున్నట్లుగా కన్నా రాసిన లేఖ బీజేపీ విధానమా… హస్తిన నుంచి వస్తోన్న స్పందన, క్లారిటీలు బీజేపీ విధానమా? స్పష్టత పరిపూర్ణంగా కరువైన పరిస్థితి! ఈ పరిస్థితుల్లో బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన స్పందన ఏమిటి?

అయితే ఏపీ బీజేపీ – ఢిల్లీ బీజేపీ ల మధ్య కన్నా లేఖ కేంద్రంగా జరుగుతున్న ఈ మొత్తం ఎపిసోడ్ ‌పై జనసేన పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టిందట. బీజేపీ అధిష్టానం ఏం చెబుతోంది? రాష్ట్ర బీజేపీ ఏం చెబుతోంది? అమరావతి విషయంలో బీజేపీలో రెండు భిన్నమైన ధోరణలు ఎందుకు ఉన్నాయి? అన్న విషయమై జనసేనలో అంతర్గత చర్చ జరుగుతోందట.

కన్నా మాటలు లైట్ తీసుకుంటూ… కేంద్రంలోని బీజేపీ నుంచి అధికారిక స్పందన వచ్చేదాకా ఈ వ్యవహారాలపై సంయమనం పాటించాలని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ నిర్ణయించుకోవడంతోపాటు.. పార్టీ నేతలకు కూడా సూచించారట! పవన్ కి ఉన్న భయం, జాగ్రత్త కన్నాకు లేకుండా పోయాయే… సొంత పార్టీ నేతలే అధిష్టాణానికి విలువనివ్వని ఈ తరుణంలో… పొత్తులో ఉన్న పవన్ చాలా విలువిస్తున్నారు.. ఫలితంగా బీజేపీలో పవన్ కి మంచి ఫ్యూచర్ ఉండొచ్చు… ఏపీ బీజేపీ కేడర్ కామెంట్!

Read more RELATED
Recommended to you

Latest news