కేవలం రైతుల కోసమే ఈ కొత్త చట్టం: హరీష్ రావు

తెలంగాణ ప్రభుత్వం రైతులకు సేవ చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లా, దుబ్బాక మండల కేంద్రంలో వున్న రైతులకు MP కొత్త ప్రభాకర్ రెడ్డి మరియు మంత్రి హరీష్ రావు గారు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసారు. అనంతరం హరీష్ రావు గారు మీడియాతో మాట్లాడుతూ.. “కేవలం రైతులకు సేవ చేయడమే ధ్యేయంగా వీలైనంత వేగంగా వారికి పనిచేయడం కోసం కొత్త రెవెన్యూ చట్టం తీసుకు వచ్చాము.” అని అన్నారు.

ఇంకా మాట్లాడుతూ.. ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వం రైతులకు మేలు చేసే చట్టాలు తీసుకువస్తే, కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతుల నడ్డి విరిచే చట్టాలు చేపడుతుందని ఎద్దేవా చేసారు. కేంద్ర ప్రభుత్వం పంపు షేడ్స్ దగ్గర అమర్చే మీటర్లు, రైతుల పాలిట శాపాలు అవుతాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. సుమారు 600 కోట్ల రూపాయలతో లక్ష కల్లాలు రైతులకోసం సాంక్షన్ చేసింది మన తెలంగాణ ప్రభుత్వం అని గర్వంగా చెప్పారు.