ఏపీలో ఆ రెండు పార్టీలూ పండ‌గ చేసుకుంటున్నాయా…?

-

రాష్ట్రంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం స‌హా దానికి తెర‌చాటుగా మద్ద‌తిస్తున్న మ‌రో పార్టీ కూడా ఇప్పుడు పండ‌గ చేసుకుంటున్నాయా ?  జ‌గ‌న్ ప్ర‌భుత్వం కొన్నాళ్ల కింద‌ట తీసుకున్న నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ.. హైకోర్టు తీర్పు చెప్ప‌డంతో ఈ రెండు పార్టీలూ కూడా ఆనందంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతున్నాయా ? అంటే.. ప‌రిశీల‌కులు ఔన‌నే అంటున్నారు. విష‌యంలోకి వెళ్తే.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 81, 85ను హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వం జారీ చేసిన ఈ రెండు జీవోలను సవాల్ చేస్తూ ఏలూరుకు చెందిన డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఈ రోజు న్యాయస్థానం తీర్పును వెలువరించింది.

ఏ మీడియం చదువుకోవాలి అనేది పిల్లలు, వారి తల్లిదండ్రులు నిర్ణయిస్తారని, ఇంగ్లీష్ మీడియంను తప్పనిసరి చేస్తే కొందరి బ్యాక్ లాగ్‌లు మిగిలిపోయే ప్రమాదం ఉందని న్యాయవాది పేర్కొన్నారు. దీనిపై ఇటీవల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన 81, 85 జీఓలను కొట్టేస్తూ హైకోర్టు నేడు తీర్పునిచ్చింది. ఇది నైతికంగా ప్ర‌తిప‌క్షాలు విజ‌యం సాధించి న‌ట్ట‌యింది. దీంతో ఆది నుంచి కూడా జ‌గ‌న్ తీసుకున్న ఇంగ్లీష్ మీడియాన్ని వ్య‌తిరేకించిన టీడీపీ, జ‌న‌సేన లు ఈ తీర్పును స్వాగ‌తించాయి. అంతేకాదు, త‌మ‌దైన శైలిలో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డాయి.

నిజానికి జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాన్ని రాష్ట్రంలోని ప్ర‌తి పేద కుటుంబం కూడా స్వాగ‌తించింది. త‌మ పిల్ల‌ల‌ను ఇంగ్లీష్ మీడియంలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చ‌దివించుకునే అవ‌కాశం వ‌చ్చినందుకు ఆనంద ప‌డింది. కానీ, తెలుగు మీడియాన్ని మాత్ర‌మే కొన‌సాగించాలంటూ.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు ఊరూ వాడా ప్ర‌చారం చేశారు. `మ‌న నుడి`- అంటూ ఏకంగా ప‌వ‌న స‌భ‌లు, స‌మావేశాలు పెట్టారు. రెచ్చ‌గొట్టే ప్ర‌సంగాలు చేశారు. అదేస మ‌యంలో చంద్ర‌బాబు కూడాపుంఖాను పుంఖాల విమ‌ర్శ‌లు గుప్పించి జ‌గ‌న్‌ను టార్గెట్ చేశారు. అయితే, వీటికి దీటుగా ప్ర‌భు త్వం వైపు నుంచి కూడా పేద‌లు మాత్ర‌మే తెలుగును బ‌తికించాలా? అంటూ ప్ర‌శ్న‌లు రావ‌డంతో వారంతా సైలెంట్ అయ్యారు.

అయితే, ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌పై త‌మ అనుచ‌రులు, సానుభూతిప‌రుల‌తో కేసులు వేయించారు. ఇప్పుడు అవి హైకోర్టులో స‌క్సెస్ అయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు అయితే.. ప్ర‌త్య‌క్షంగా ప్ర‌భుత్వం ఓడిపోయి.. ప‌రోక్షంగా ప్ర‌తిప‌క్షాల వాద‌నే గెలిచినా. వెనుక ప్ర‌జ‌లంటూ ఒక‌రున్నారు కాబ‌ట్టి.. అస‌లు ర‌ణ క్షేత్రంలో వారు ఎవ‌రిని ఓడిస్తార‌నేది మ‌రో నాలుగేళ్ల త‌ర్వాత తేలుతుంది. ఇక‌, తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్ర‌భుత్వం సుప్రీం కోర్టులో స‌వాల్ చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. మ‌రి అక్క‌డ ఏంజ‌రుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news