వైఎస్సాఆర్సీపీలో జోరందుకున్న చేరికలు.. తోట ఫ్యామిలీ, పీవీపీ, రాజారవీంద్ర చేరిక

ఓ జాతరను తలపిస్తోంది వైఎస్సాఆర్సీపీ కేంద్ర కార్యాలయం. ఇవాళ ముఖ్యమైన నేతల చేరికతో అక్కడంతా పండుగ వాతావరణం నెలకొన్నది. టీడీపీకి షాక్ ఇస్తూ టీడీపీకి రాజీనామా చేసిన టీడీపీ ఎంపీ, టీడీపీ లోక్ సభ పక్ష నేత తోట నరసింహం, ఆయన భార్య తోట వాణి ఇవాళ వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వారికి వైఎస్ జగన్ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

మరోవైపు ప్రముఖ పారిశ్రామిక వేత్త పీవీపీ కూడా ఇవాళ వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ప్రముఖ సినీ నటుడు రాజా రవీంద్ర కూడా వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సాఆర్సీపీలో చేరారు. వైఎస్ జగన్.. తమకు ఏ పని అప్పగించినా బాధ్యతగా నిర్వర్తిస్తామని వాళ్లు ప్రకటించారు.