వైసీపీ అభ్యర్థుల ప్రకటన వాయిదా..! అసలు కారణం ఇదే..!

6

ఎన్నికల సమరం ప్రారంభమయింది. ఏపీలో పోలింగ్ కు ఇంకా నెల రోజుల సమయం కూడా లేదు. ఈనేపథ్యంలో పార్టీలన్నీ తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. దీంతో వైఎస్సాఆర్సీపీ కూడా తమ అభ్యర్థులను ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇవాళ పార్టీ సీనియర్, ముఖ్య నేతలతో వైఎస్ జగన్ అభ్యర్థుల గురించి చర్చించారు. ఇవాళ అభ్యర్థుల తొలి జాబితాను రిలీజ్ చేయాలని భావించినా… పార్టీలో కొత్తగా చేరికలతో వైఎస్ జగన్ బిజీగా ఉన్నారు.

ysrcp candidates first list will be released on 16th in Idupulapaya

భారీ ఎత్తున చేరికల నేపథ్యంలో అభ్యర్థుల జాబితాపై తుది కసరత్తు చేస్తున్నారు. అందుకే.. వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ఈనెల 16న ఉధయం 10.26 గంటలకు విడుదల చేయాలని పార్టీ భావించింది. ఇడుపులపాయలో అభ్యర్థుల జాబితాను వైఎస్ జగన్ ప్రకటిస్తారు. అనంతరం.. అక్కడి నుంచే వైఎస్ జగన్.. తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.

amazon ad