ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వర్ రావుది కీలక పాత్ర. ఆయన ఇక్కడి రాజకీయాలను ఎప్పటి నుంచో శాసిస్తున్నారు. టీడీపీ నుంచి ఆయన టీఆర్ఎస్(TRS) లో చేరిన తర్వాతే ఇక్కడ టీఆర్ ఎష్‌కు తిరుగులేకుండా పోయిది. ఆయన అండగానే వామపక్ష భావజాలం ఉన్న ఖమ్మంలో గులాబీ జెండా ఎగిరింది. తుమ్మలకు కేసీఆర్ కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చారు.
అయితే గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తుమ్మలను పార్టీ పెద్దలు పక్కన పెడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తీవ్ర అసంతృప్తిలో ఉన్న తుమ్మల నాగేశ్వర్ రావు.. త్వరలోనే బీజేపీలో చేరుతారనే ప్రచారం మొన్నటి వరకు ఊపందుకుంది. ఎందుకంటే ఇక్కడి ఇన్ చార్జి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కావాలనే తుమ్మలను టార్గెట్ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
దీంతో అలర్ట్ అయిన టీఆర్ ఎస్ అధిష్టానం తుమ్మలను అక్కున చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు కూడా రెడీ అవుతోంది. కాకపోతే మినిస్టర్ పదవి మాత్రం దక్కకపోవచ్చు. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి కూడా ఎమ్మెల్సీ పదవి హామీ ఇచ్చిన కేసీఆర్.. మరి తుమ్మలకు ఎలాంటి పదవి ఇస్తారనేది చూడాలి. కానీ తుమ్మల మాత్రం తనకు మంత్రి పదవి ఇస్తేనే ఎమ్మెల్సీ ఇవ్వాలని షరతు పెడుతున్నారంట. మరి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.