తెలంగాణ కార్మిక శాఖ మినిస్టర్ మల్లారెడ్డి malla reddy ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉన్నారు. ఆయన కావాలని చేయకపోయినా కొన్నిసార్లు ఆయన ఆవేశంగా మాట్లాడే మాటలు ఆయన్ను ఇరకాటంలో పెడుతుంటాయి. ఇప్పటికే రేవంత్ చేసిన ఆరోపణలతో కేసీఆర్ దగ్గర ఇమేజ్‌కాస్త దెబ్బతింది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు ఆయనకు మరో షాక్ వచ్చి పడిది.
ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా పల్లె ప్రగతి ప్రోగ్రామ్ చేస్తున్న విషయం అదరికీ విదితమే. కాగా ఇందులో భాగంగా మంత్రి తన నియోజకవర్గంలోని గౌడవెళ్లి ఊరుకు అభివృద్ధి పనుల నిమిత్తం చేరుకున్నారు. ఇక ఆ ఊరు గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ కు చెందిన వ్యక్తి కావడం ఇక్కడ గమనార్హం. సర్పంచ్ కాంగ్రెస్ కాబట్టే ఆ ఊరుకు మంత్రి సరిగా నిధులు కేటాయించడం లేదని ఆరోపణలు ఉన్నాయి.
ఇదే అదునుగా సేమ్ ఆరోపణలను గ్రామస్తులు చేస్తూ మంత్రిని నిలదీశారు. అక్కడితో ఆగకుండా గ్రామ సభ కాస్తా టీఆర్ఎస్ పార్టీ మీటింగ్‌లాగా మారిపోయిందని మండిపడ్డారు. మంత్రి కావాలనే తమ ఊరి అభివృద్ధికి సహకరించట్లేదని గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. దీంతో మంత్రి వారికి ఎంత సర్ధి చెప్పినా లాభం లేకుండా పోయింది. ఇక అక్కడి నుంచి ఎల్లంపేట గ్రామంలో నిర్వహించిన ఓ సభలో మంత్రి హాజరుకాగా అక్కడకు కూడా ఎవరూ రాకుండానే నిరసనలు తెలిపారు. మొత్తానికి మన మంత్రిగారికి వరుస షాక్‌లే తగులుతున్నాయి.