ఈ సారి తెలంగాణలో త్రిముఖ పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది…గత ఎన్నికల్లో టీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీల మధ్యే ప్రధాన పోరు నడిచిన విషయం తెలిసిందే…అయితే బీజేపీ పుంజుకోకుండా ఉంటే…ఈ సారి ఎన్నికల్లో కూడా ఆ రెండు పార్టీల మధ్యే పోరు నడిచేది. కానీ అనూహ్యంగా బీజేపీ పుంజుకోవడం…కాంగ్రెస్ పార్టీని వెనక్కినెట్టి…రేసులో ముందుకొస్తుంది. టీఆర్ఎస్ పార్టీతో ఢీ అంటే ఢీ అనేలా బీజేపీ రాజకీయం చేస్తుంది.
అయితే పుంజుకుంటున్న క్రమంలో…ఈ సారి చాలా నియోజకవర్గాల్లో త్రిముఖ పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. అలా త్రిముఖ పోరుకు అవకాశాలు ఉన్న స్థానాల్లో ఉప్పల్ కూడా ఒకటి అని చెప్పొచ్చు…నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో ఏర్పడిన ఈ స్థానంలో 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అప్పుడు కూడా ఇక్కడ త్రిముఖ పోరు జరిగింది…కాంగ్రెస్, టీఆర్ఎస్, ప్రజారాజ్యం పార్టీల మధ్య పోరు జరిగింది. టీఆర్ఎస్-టీడీపీ పొత్తులో పోటీ చేశాయి.
2014 ఎన్నికల్లో కూడా ఇక్కడ ట్రైయాంగిల్ ఫైట్ నడిచింది…టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోరు జరిగింది. అయితే టీడీపీతో పొత్తులో పోటీ చేసి బీజేపీ తరుపున ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ గెలిచారు. అయితే 2018 ఎన్నికలోచ్చేసరికి మరొకసారి ట్రైయాంగిల్ ఫైట్ నడిచింది. టీఆర్ఎస్-టీడీపీ-బీజేపీల మధ్య పోరు నడిచింది. ఇక్కడ టీడీపీ-కాంగ్రెస్ పొత్తు ఉంది. కానీ విజయం టీఆర్ఎస్ పార్టీకి దక్కింది. అయితే ఇలా మూడు ఎన్నికల్లోనూ ఇక్కడ త్రిముఖ పోరే జరిగింది.
ఈ సారి ఎన్నికల్లో కూడా ఇక్కడ త్రిముఖ పోరు జరగడం ఖాయం…టీఆర్ఎస్-బీజేపీ-కాంగ్రెస్‌ల మధ్య వార్ నడవనుంది. ఇక్కడ మూడు పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇటీవల వచ్చిన ఓ సర్వేలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉందని తెలిసింది. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కూడా ఉప్పల్ డివిజన్‌ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది…ఇక్కడ గాని రేవంత్ బరిలో దిగితే కాంగ్రెస్ గెలుపు అవకాశాలు మెరుగు అవుతాయి. చూడాలి మరి ఈ సారి ఉప్పల్ ఎవరికి దక్కుతుందో.