ఆ విషయంలో బీజేపీని బీట్ చేయలేకపోతున్న టీఆర్ఎస్…!

-

తెలంగాణలో ప్రధాన పార్టీల మధ్య రాజకీయ యుద్ధం తీవ్రంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీల మధ్య ట్రైయాంగిల్ వార్ నడుస్తోంది. ఈ మూడు పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. అయితే కాంగ్రెస్, బీజేపీలు ప్రధానంగా టీఆర్ఎస్‌నే టార్గెట్ చేసుకుని ముందుకెళుతున్నాయి. టీఆర్ఎస్‌నే ఎలాగైనా దెబ్బకొట్టాలని చూస్తున్నాయి.

bjp-trs
bjp-trs

అటు ప్రతిపక్షాలకు చెక్ పెట్టాలని టీఆర్ఎస్ కూడా అదిరిపోయే వ్యూహాలతో ముందుకెళుతుంది. ఇలా ప్రధాన పార్టీలు ఒకరిపై ఒకరు ఆధిక్యం దక్కించుకోవడానికి చూస్తున్నారు. అయితే బయటే కాదు వీరి వార్ సోషల్ మీడియాలో కూడా తీవ్రంగా జరుగుతుంది. కాకపోతే సోషల్ మీడియాలో బీజేపీదే పై చేయిగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో బీజీపీ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. ఇక రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాక కాంగ్రెస్ కూడా సోషల్ మీడియాలో దూకుడు ప్రదర్శిస్తుంది. అటు అధికార టీఆర్ఎస్ సైతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.

ఎంత యాక్టివ్‌గా ఉన్నా సరే టీఆర్ఎస్, బీజేపీని బీట్ చేయలేకపోతుందని తెలుస్తోంది. ఏ అంశంలోనైనా టీఆర్ఎస్‌ని సోషల్ మీడియా వేదికగా బీజేపీ దాడి చేస్తోంది. ముఖ్యంగా హుజూరాబాద్ ఉపఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ సోషల్ మీడియా టీం బాగా దూకుడుగా ఉంది. ఇక బీజేపీకి ధీటుగా సోషల్ మీడియా టీంని పెట్టాలని టీఆర్ఎస్ చూస్తోంది.

ఎందుకంటే ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్‌తోనే దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీకి లబ్ది చేకూరగా, టీఆర్ఎస్‌కు డ్యామేజ్ జరిగింది. దుబ్బాకలో జరిగిన ప్రతి అంశాన్ని బీజేపీ వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టేవారు. ఇప్పుడు హుజూరాబాద్ ఉపఎన్నిక విషయంలో బీజేపీ సోషల్ మీడియా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. వారికి ధీటుగా పనిచేయాలని టీఆర్ఎస్ చూస్తోంది. మొత్తానికైతే సోషల్ మీడియాలో బీజేపీని టీఆర్ఎస్ బీట్ చేయలేకపోతుందనే తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news