రెండు వేల కోట్ల భారీ కుంభకోణాన్ని బయట పెట్టిన ఐటీ శాఖ..!!

-

ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలలో మరియు దక్షిణాదిలో ఐటీ అధికారులు ప్రముఖుల ఇళ్లపై సోదాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ముందుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ ల పై తర్వాత హీరోయిన్ల ఇళ్లపై కార్యాలయాలపై సోదాలు చేశారు ఐటీ అధికారులు. ఆ తరువాత కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు విజయ్ ఇంటిపై మరియు కార్యాలయాలపై కూడా సోదాలు చేయడం జరిగింది. ఇలా సోదాలు చేస్తూ ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ నాయకులను ముఖ్యంగా గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లను టార్గెట్ చేసి సోదాలు చేశారు ఐటీ అధికారులు. Image result for two thousand rupees note bulk

గత వారం రోజుల నుండి జరుగుతున్న ఈ సోదాల్లో ఒకప్పుడు ఏపీ ex సీఎం దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి దగ్గర రెండు వేల కోట్ల రూపాయలు అనధికారికంగా చేతులు మారినట్లు ఐటీ అధికారులు గుర్తించినట్లు ఇంటర్నెట్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. 40కిపైగా ప్రాంతాల్లో సోదాలు చేసిన అధికారులు మూడు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీల కార్యాలయాల్లో కూడా సోదాలు చేయడం జరిగింది. ఈ సోదాల్లో దారుణమైన వివరాలు బయటపెట్టారు. 

 

వీటికి సంబంధించిన ఈ మెయిల్, వాట్సాప్ ద్వారా జరిపిన లావాదేవీలు వివరాలు సేకరించారు అధికారులు. బోగస్‌ సంస్థలకు సబ్‌ కాంట్రాక్టులను ఇచ్చిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీలు ట్యాక్స్‌ ఆడిట్‌ను తప్పించుకోవడానికి రూ.2 కోట్లకన్నా తక్కువ టర్నోవర్‌ ఉన్న కంపెనీలను సృష్టించిన అక్రమార్కులు జరిగిన దాడుల్లో ఐటీ అధికారులు గుర్తించారు. జరిగిన దాడుల్లో ముఖ్యంగా అసలు కంపెనీలు, షెల్‌ కంపెనీల ఐటీ రిటర్నులను ఒకే ఐపీ అడ్రస్‌తో ఫైల్ చేసినట్లు గుర్తించడం జరిగింది. మొత్తం మీద ప్రాథమిక దర్యాప్తు లోనే రెండు వేల కోట్లకు పైగా ఐటీ అధికారులు అక్రమాలు గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.   

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news