ఖమ్మంలో ఊహించని ట్విస్ట్..పొంగులేటి సవాల్ నిజమవుతుందా?

-

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బి‌ఆర్‌ఎస్ పార్టీని ఒక్క సీటు కూడా గెలవనివ్వను..ఖమ్మం నుంచి ఒక్కరినీ కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వను అని ఆ మధ్య పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ చేసిన విషయం తెలిసిందే. దీనికి బి‌ఆర్‌ఎస్ నేతలు కూడా కౌంటర్ ఇచ్చారు. జిల్లాలో 10కి 10 సీట్లు తామే గెలుస్తామని రివర్స్ లో ఛాలెంజ్ చేస్తున్నారు. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో పొంగులేటి తన వర్గం నేతలతో కలిసి కాంగ్రెస్ లో చేరిపోయారు.

దీంతో ఖమ్మంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. లేటెస్ట్ సర్వే ప్రకారం ఖమ్మంలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉందని తేలింది. 10 సీట్లు ఉంటే కాంగ్రెస్ 6 సీట్లలో లీడ్ ఉందని, ఒక సీటులో బి‌ఆర్‌ఎస్‌కు లీడ్ ఉందని, 3 సీట్లలో టఫ్ ఫైట్ ఉందని తేలింది. ఇక బి‌ఆర్‌ఎస్ లీడ్ ఉన్న సీటు ఖమ్మం అసెంబ్లీ.. ఇక్కడ మంత్రి పువ్వాడ అజయ్ ఉన్నారు. ఈయనకు బి‌ఆర్‌ఎస్ సపోర్ట్ తో పాటు పాత కమ్యూనిస్టులు..అలాగే కమ్మ వర్గం కావడంతో టి‌డి‌పి శ్రేణుల మద్ధతు ఉంది. దీంతో ఈయన గెలుపు సులువు అని తేలింది.

ఇక కాంగ్రెస్ గెలుపు అవకాశాలు ఉన్న సీట్లలో మొదట మధిర ఉంది. ఇక్కడ భట్టి విక్రమార్క మళ్ళీ గెలుస్తారని తేలింది. అటు భద్రాచలంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య సైతం మళ్ళీ గెలుస్తారని సర్వే అంచనా వేసింది. కొత్తగూడెం బరిలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దిగితే..కాంగ్రెస్ గెలుపు వన్‌సైడ్ అంటున్నారు. అలాగే పాలేరు బరిలో షర్మిల కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే గెలుపు ఖాయమని తెలిసింది.

ఇటు ఇల్లందు, పినపాకలో సైతం కాంగ్రెస్ హవా ఉందని తేలింది. అటు సత్తుపల్లి, వైరా, అశ్వరావుపేట నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉంటుంది..కానీ బలమైన అభ్యర్ధులు ఉంటే కాంగ్రెస్ స్వల్ప లీడ్ తో బయటపడుతుందని తెలిసింది. మొత్తానికి 10 సీట్లు ఉంటే కాంగ్రెస్ దాదాపు 9 సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉందని, బి‌ఆర్‌ఎస్‌కు ఒక సీటు వస్తుందని తేలింది.

Read more RELATED
Recommended to you

Latest news