ఏపీలో రాని స‌మ‌స్య తెలంగాణ‌లో ఎందుకు : కేంద్ర పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ కార్య‌ద‌ర్శి

-

తెలంగాణ రాష్ట్రం నుంచి బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయ‌డం సాధ్యం కాద‌ని కేంద్ర పౌర స‌ర‌ఫ‌రాల శాఖ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సుధాంశు పాండే తెల్చి చెప్పారు. అలాగే కేంద్ర ప్ర‌భుత్వం దేశ వ్యాప్తంగా ఒకే ప్రొక్యూర్ మెంట్ విధానాన్ని అమ‌లు చేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం దృష్టిలో అన్ని రాష్ట్రాలు ఒకటే అని అన్నారు. ధాన్యం కొనుగోలుపై తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ముందుగా చేసుకున్న ఒప్పందం ప్ర‌కార‌మే కేంద్ర ప్ర‌భుత్వం ధాన్యం సేక‌రిస్తుంద‌ని తెల్చి చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వంపై తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తున్న ఆరోప‌ణ‌లు అన్ని కూడా అవాస్త‌వం అని స్ప‌ష్టం చేశారు.

అలాగే ఆంధ్ర ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఒకే వాతావ‌ర‌ణ జోన్ లో ఉన్నాయ‌ని అన్నారు. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో లేని స‌మ‌స్య తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వ‌స్తుంద‌ని ప్ర‌శ్నించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతుల‌కు, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కే సంబంధం ఉంటుంద‌ని అన్నారు. బియ్యం సేక‌ర‌ణ విషయంలో మాత్ర‌మే.. రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు, కేంద్ర ప్ర‌భుత్వం మ‌ధ్య ఒప్పందం ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. రా రైస్ ను తెలంగాణ తో పాటు ఏ రాష్ట్రం నుంచి కూడా కొనుగోలు చేయ‌డం లేద‌ని అన్నారు. పంజాబ్ నుంచి కూడా ఒక్క గింజ‌ను కూడా సేక‌రించ‌లేద‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news