వైసీపీ నుంచి కేంద్ర మంత్రులు వీరే…!

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. బుధవారం ఆయన ప్రధాని నరేంద్ర మోడీ తో సమావేశమై కీలక అంశాలపై చర్చలు జరిపారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా పలు కీలక అంశాలను జగన్ ప్రధాని దృష్టికి తీసుకువెళ్ళారు. ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, ఆర్ధిక లోటు, ఆర్ధిక సాయం వంటి అంశాలను ప్రధాని దృష్టికి జగన్ తీసుకువెళ్ళారని తెలుస్తుంది.

ఇక ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కూడా కీలక చర్చలు ఇరువురి మధ్య జరిగాయని అంటున్నారు పరిశీలకులు. మార్చ్ లో ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రాజ్యసభ స్థానాలు కాళీ అవుతున్నాయి. వైసీపీ నుంచి నలుగు రాజ్యసభకు వెళ్ళడం ఖాయం. ఇక పార్లమెంట్ లో కీలక బిల్లుల ఆమోదం కోసం కేంద్రం గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. దీనికి ప్రాంతీయ పార్టీల మద్దతు అనేది చాలా అవసరమని కేంద్రం భావిస్తుంది.

అందుకే వైసీపీ తో స్నేహం చెయ్యాలని చూస్తుంది ఇందులో భాగంగానే కేంద్ర మంత్రి వర్గంలోకి ఇద్దరు మంత్రులను తీసుకునే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. విజయసాయి రెడ్డి సహాయమంత్రిగా స్వతంత్ర హోదాలోనూ, అలాగే బాపట్ల లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన నందిగం సురేష్ మరొక సహాయమంత్రిగానూ కేంద్ర క్యాబినెట్లో చేరబోతున్నట్టు సమాచారం. త్వరలో జరిగే మంత్రి వర్గ విస్తరణలో వీరికి చోటు దక్కుతుందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news