కాంగ్రెస్‌ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసిన ఆ అధికారులను వదిలిపెట్టాం: ఉత్తమ్‌ వార్నింగ్‌

Join Our Community
follow manalokam on social media

అధికార టీఆర్‌ఎస్‌ నాయకుల మాటలు విని కాంగ్రెస్‌ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసిన రాష్ట్రంలోని పలు శాఖల అధికారులను వదిలపెట్టబోమని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హెచ్చరించారు. నల్లగొండ– వరంగల్‌–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ముఖ్య నేతలు, ఆయా జిల్లాల డీసీసీ అధ్యక్షులతో ఉత్తమ్‌ మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, బీజేపీకి ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగే హక్కు లేదని ధ్వసమెత్తారు. ఓ పార్టీ విభజన హామీలను విస్మరించి తెలంగాణకు అన్యాయం చేస్తుండగా.. మరోపార్టీ నిరుద్యోగ భృతి ఇవ్వకుండా నిరుద్యోగులను, పీఆర్సీ ఇవ్వకుండా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలను తీవ్ర అన్యాయం చేస్తున్నాయని ఉత్తమ్‌ ఆరోపించారు.

దేశంలో 7.9 శాతం నిరుద్యోగం..

తెలంగాణ ఉద్యమం తరహాలోనే తెలంగాణలో నిరుద్యోగ భృతి సాధించే దాకా పోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ ప్రధాని మంత్రి అయినప్పుటి నుంచి దేశంలో నిరుద్యోగం 7.9 శాతానికి పెరిగిందన్నారు. ఇష్టానుసారంగా ధరలను పెంచుతూ దేశ ప్రజల నడ్డి విరుస్తురన్నారు. అధికారంలోకి రాకముందు ఓ మాట వచ్చాక మరోమాట ఆడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలోనూ 33 నిరుద్యోగం ఉందన్నారు. ఈ రెండు పార్టీలు తెలంగాణకు చేసేందేవీ లేదని ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లు అడుగుతున్నారని వారు ప్రశ్నించారు.

TOP STORIES

నమ్మండి.. ఈ ప్లాస్టిక్‌ పర్యావరణానికి హాని కలిగించదు

పర్యావరణానికి హాని చేయని ప్లాస్టిక్‌ కవర్లను చూశారా? ప్లాస్టిక్‌ పర్యావరణానికి హాని కలిగించదా! అని ఆశ్చర్యపోకండి. మీరు విన్నది నిజమేనండి. మనం వాడి పడేసిన కవర్లు...