బాబుకు సోము షాక్.. పనబాక పాత వీడియోతో ఎటాక్ !

-

తిరుపతి లోకసభ ఉప ఎన్నికలో వైసీపీ నుంచి గురుమూర్తి, పనబాక లక్ష్మి టీడీపీ నుంచి పోటీ చేస్తుండగా, బిజెపి – జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభ కాంగ్రెస్ నుంచి చింతా మోహన్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలను దాదాపు అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో కాస్త సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న సోము వీర్రాజు టిడిపికి చంద్రబాబుకు షాక్ ఇచ్చే లాగా ఒక వీడియో షేర్ చేశారు.

ఆ వీడియోలో చంద్రబాబును ప్రస్తుతం టీడీపీ నుంచి పోటీ చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి విమర్శిస్తున్నట్లుగా ఉంది. అయితే ఈ వీడియోలో ఆమె మాట్లాడుతున్న అంశాలు ఆమె తెలుగుదేశం లో చేరక ముందు కాంగ్రెస్ నేత గా ఉన్నప్పుడు మాట్లాడిన వ్యాఖ్యలు. ఆ వీడియో షేర్ చేసిన ఆయన ‘తిరుపతి ఎంపీ అభ్యర్థి శ్రీమతి పనబాక లక్ష్మీ గారు టిడిపి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు గారిని వర్ణించిన సన్నివేశం మీ కోసం.. సమర్పిస్తున్నా అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news