రాములమ్మ ఎంట్రీ…పద్మా దేవేందర్‌కు ఈ సారి టఫ్ ఫైట్ తప్పదా…

-

తెలంగాణ రాజకీయాల్లో గత రెండు ఎన్నికల నుంచి టి‌ఆర్‌ఎస్ పార్టీకి పెద్దగా ప్రతిపక్షాలు పోటీ ఇవ్వలేకపోతున్నాయనే చెప్పొచ్చు. అందుకే గత రెండు ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్లుగా టి‌ఆర్‌ఎస్ గెలుస్తూ వచ్చింది. కానీ ఈసారి పరిస్తితి అలా కనిపించడం లేదు. టి‌ఆర్‌ఎస్‌కు ధీటుగా కాంగ్రెస్, బి‌జే‌పిలు పుంజుకున్నాయి. ఈ సారి ప్రతి నియోజకవర్గంలో ప్రతిపక్షాలతో టి‌ఆర్‌ఎస్‌కు గట్టి ఎదురయ్యేలా కనిపిస్తోంది.

padma devender reddy

ఈ క్రమంలోనే మెదక్ అసెంబ్లీ స్థానంలో ఈ సారి అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగేలా కనిపిస్తోంది. గత రెండు పర్యాయలుగా ఇక్కడ టి‌ఆర్‌ఎస్ తరుపున పద్మా దేవేందర్ రెడ్డి విజయం సాధిస్తూ వస్తున్నారు. రెండుసార్లు సులువుగా విజయం సాధించేశారు. కానీ ఈ సారి ఎన్నికల్లో మాత్రం పద్మాకు టఫ్ ఫైట్ ఎదురయ్యేలా కనిపిస్తోంది. ఈ సారి ఇక్కడ బి‌జే‌పి తరుపున విజయశాంతి బరిలో దిగే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.

2014 ఎన్నికల్లో విజయశాంతి కాంగ్రెస్ తరుపున మెదక్లో పోటీ చేసి పద్మాపై ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో పోటీకి దిగలేదు. ఆ తర్వాత ఆమె బి‌జే‌పిలోకి వచ్చారు. ఇక బి‌జే‌పి తరుపున ఈ సారి మెదక్ పార్లమెంట్ లేదా, మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ బరిలో దిగితే పద్మాకు టఫ్ ఫైట్ తప్పదు. అటు కాంగ్రెస్‌కు ప్రస్తుతం అభ్యర్ధులు కనబడటం లేదు. కానీ బి‌జే‌పి నేత, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ళ శశిధర్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లనున్నారని తెలుస్తోంది. 2004లో శశిధర్ ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ తరుపున గెలిచారు.

అయితే 2018 ఎన్నికల్లో శశిధర్‌కు టికెట్ రాలేదు. ఆయన సోదరుడు ఉపేందర్ రెడ్డికి టికెట్ వచ్చింది. కానీ ఆయన పద్మాపై ఓడిపోయారు. ఈ మధ్య అనారోగ్యంతో ఉపేందర్ చనిపోయారు. ఈ క్రమంలోనే శశిధర్ కాంగ్రెస్‌లోకి వెళ్లడానికి చూస్తున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్‌లోకి వస్తే మెదక్ అసెంబ్లీ నుంచి శశిధర్ పోటీ చేసే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ సారి మెదక్ బరిలో పద్మా దేవేందర్ రెడ్డి మాత్రం ప్రతిపక్షాల నుంచి టఫ్ ఫైట్ ఎదుర్కొనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news