కారుతో కమలం…కాంగ్రెస్‌ లోకి పోతాం…

-

తెలంగాణలో కారు పార్టీతో కమలం పార్టీ పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారం కాంగ్రెస్‌కు బాగా లాభం చేకూర్చేలా కనిపిస్తోంది. ఇప్పటికే చాలాసార్లు రేవంత్ రెడ్డి, ఆ రెండు పార్టీలు ఒక్కటే అని ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. అందుకు తగ్గట్టుగా కొన్ని ఉదాహరణలు కూడా చెబుతూ వస్తున్నారు. లింగోజీగూడ డివిజన్  ఉపఎన్నిక విషయంలో బి‌జే‌పి-టి‌ఆర్‌ఎస్‌లు ఒక్కటైన విషయం తెలిసిందే. ఆ రెండు పార్టీలు ఒక్కటైనా సరే కాంగ్రెస్ పార్టీనే అక్కడ గెలిచింది.

congress
congress

అలాగే బి‌జే‌పి నేతలు కే‌సి‌ఆర్ చెప్పినట్లు పనిచేస్తున్నారని, ఈటలని కే‌సి‌ఆర్ కావాలని బి‌జే‌పిలోకి పంపించారని విమర్శిస్తూ వస్తున్నారు. అలాగే తాజాగా ఢిల్లీలో టి‌ఆర్‌ఎస్ పార్టీ కార్యలయం కట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం స్థలం ఇవ్వడం, కే‌సి‌ఆర్ వరుసపెట్టి ప్రధాని, కేంద్ర మంత్రులని కలవడం, పది రోజుల పాటు ఢిల్లీలోనే ఉండటంతో…టి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిల పొత్తు ఖాయమైందని తెలంగాణ రాజకీయాల్లో ప్రచారం ఊపు అందుకుంది.

ఈ ప్రచారమే బి‌జే‌పి కొంపముంచేలా కనిపిస్తోంది. మొన్నటివరకు తెలంగాణలో టి‌ఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఉన్న బి‌జే‌పికి ఇప్పుడు కష్టాలు వచ్చి పడ్డాయి. చాలా మంది నేతలు టి‌ఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బి‌జే‌పి అని చెప్పి ఆ పార్టీలో చేరారు. కానీ ఇప్పుడు ఆ నాయకులు నిదానంగా బి‌జే‌పికి షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. అటు వైపు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌ని పైకి లేపే ప్రయత్నం చేయడంతో అందులోకి జంప్ చేసేందుకు చూస్తున్నారు.

ఇప్పటికే హైదరాబాద్‌లో బి‌జే‌పి సీనియర్ నాయకుడు కొలన్‌ హన్మంత్‌రెడ్డి, ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో ఎంత కష్టపడిన గుర్తింపు లేదని, తమ కార్యకర్తలకు కూడా అవమానాలు ఎదురవుతున్నాయని చెప్పి హన్మంత్ రెడ్డి, బి‌జే‌పికి షాక్ ఇచ్చారు. ఇక ఏదొకరోజు టి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిలు కలిసిపోతాయని చెప్పి మరీ, కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. అయితే హన్మంత్ రెడ్డి మాత్రమే కాదు…ఇంకా కొందరు నాయకులు ఈ పొత్తుల ప్రచారంపై అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. వారు కూడా కాంగ్రెస్‌లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news