విజయసాయి ఆన్ ఫీల్డ్…టీడీపీ గుర్తింపు రద్దు?

-

గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో సైలెంట్‌గా ఉన్న విజయసాయి రెడ్డి ఫామ్‌లోకి వచ్చారు. గతంలో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై పెద్దగా విమర్శలు చేయని విజయసాయి రెడ్డి దూకుడు పెంచారు. అనూహ్యంగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత విజయసాయి వాయిస్ మార్చారు. తాజాగా చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళి….టీడీపీ ఆఫీసులపై వైసీపీ శ్రేణులు దాడుల అంశంపై రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

అలాగే రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని, కాబట్టి రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. అయితే చంద్రబాబుకు వైసీపీ నుంచి అదే స్థాయిలో కౌంటర్లు వచ్చేస్తున్నాయి. ఇదే సమయంలో విజయసాయిరెడ్డి స్పందిస్తూ….బాబుపై ఫైర్ అయ్యారు. బాబు ఢిల్లీకి వెళ్లింది…అమిత్‌షాపై రాళ్లు వేసిన వీడియో చూపించేందుకా? లేక ఢిల్లీలో వ్యవస్థలను ప్రభావితం చేసేందుకా? అంటూ ప్రశ్నించారు.

చంద్రబాబు 36 గంటల బూతు దీక్ష నిర్వహించారని, పట్టాభి వ్యాఖ్యలను చంద్రబాబు సమర్థిస్తున్నారా? అని ప్రశ్నించిన విజయసాయి… ఏపీలో ఆర్టికల్ 356 తీసుకొచ్చే పరిస్థితులు లేవని అన్నారు. అదే సమయంలో తాము కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ని కలవనున్నట్లు చెప్పారు. ఇక సి‌ఈ‌సిని కలిసి…టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని వైసీపీ కోరనుంది. ఇప్పటికే ఈ అంశంపై వైసీపీ నేతలు క్లారిటీ ఇచ్చేశారు. సి‌ఎం జగన్‌ని ఇష్టారాజ్యంగా తిడుతున్న టీడీపీ…మావోయిస్ట్ పార్టీ అని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.

అలాగే ఇలాంటి పార్టీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్ సజ్జల రామకృష్ణారెడ్డి చేశారు. ఇదే హామీ విజయసాయి కోసం వైసీపీ సిఐసిని కలిసి టీడీపీని రద్దు చేయాలని కోరినందుకు గుర్తింపు. అయితే టీడీపీ కోరినట్లు….రాష్ట్రపతి పాలన పెట్టడం ఎలా కుదరదో.. టీడీపీ గుర్తింపును సైతం రద్దు చేయడం సాధ్యమయ్యే పని కాదని చెప్పాలి. కాకపోతే ఎవరికి వారే ఢిల్లీ స్థాయిలో హైలైట్ అయ్యి, ప్రత్యర్ధులని దెబ్బతీయాలని చూస్తే ఎత్తుగడలు వేస్తున్నారు. మరి ఇందులో ఎవరి ఎత్తుగడ సక్సెస్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news