విజయసాయి ముందు ఢిల్లీలో బాబు ఆటలు సాగడం లేదా…?

-

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాజకీయ పరిణామాలు అన్నీ రాజధాని చుట్టూనే తిరుగుతున్నాయి. రాజకీయంగా బలహీనంగా ఉన్న తెలుగుదేశం పార్టీ రాజధానిని అమరావతిలోనే ఉంచాలని పట్టుబడుతూ తీవ్రంగానే పోరాటం చేస్తుంది. పార్లమెంట్ వేదికగా కూడా వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని భావించిన చంద్రబాబు తన ఎంపీలకు దిశా నిర్దేశం చేస్తూ వచ్చారు. దీనితో ఎంపీలు కూడా ఆ విధంగానే అడుగులు వేస్తున్నారు.

అంత వరకు బాగానే ఉంది గాని ఇప్పుడు ఢిల్లీలో చంద్రబాబు అనుకున్నది జరగడం లేదు. రాజధాని రైతులను, జెఎసి నేతలను ఢిల్లీ పంపించింది టీడీపీ. వాళ్ళు వెళ్లి రాష్ట్రపతిని కలిసారు. అలాగే చాలా మంది కేంద్ర మంత్రులను కూడా కలిసారు. అంత వరకు బాగానే ఉంది గాని, అక్కడ వాళ్లకు ఏ స్పష్టమైన హామీ రావడం లేదు. రాష్ట్రపతి కలిసినా వాళ్లకు ఉపయోగం ఉన్నట్టు కనపడటం లేదు.

కేంద్ర మంత్రులను కలిసినా అది మాకు సంబంధం లేని విషయమని అంటున్నారు. ప్రధానిని కలిసినా దాదాపు అదే సమాధానం వస్తుంది. అయితే దీని వెనుక ప్రధాన హస్త౦ విజయసాయిది అంటున్నారు పరిశీలకులు. విజయసాయికి కేంద్ర పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయని, ఆ సంబంధాలతో చంద్రబాబు ఆటలు సాగనివ్వడం లేదని అంటున్నారు. జాతీయ మీడియాలో కథనాలు రాయించినా ప్రయోజనం లేదని అంటున్నారు.

ఇక తన అనుకూల మీడియా ద్వారా ఎన్ని కథనాలు రాసినా విజయసాయి వ్యూహాల ముందు చంద్రబాబు తేలిపోతున్నారనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. వాస్తవానికి పార్లమెంట్ లో కేంద్రం మాకు సంబంధం లేదని చెప్పినా సరే అనుకూల మీడియా ద్వారా అనుకూల కథనాలు రాయించారు. అందుకే రాజధాని విషయంలో సుజనా చౌదరి లాంటి వాళ్ళు సైలెంట్ అయిపోయారని, చంద్రబాబు వ్యతిరేకి అయిన జీవిఎల్ లాంటి వాళ్ళ వాయిస్ పెరిగింది అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news