విశాఖకు రాజధాని.. ఏడాదిలో మైలేజ్ వస్తుందా?

-

అదిగో త్వరలోనే మూడు రాజధానులు ఏర్పాటు అయిపోతాయి…విశాఖ నుంచి జగన్ పాలన మొదలుపెడతారని గత మూడేళ్లుగా వైసీపీ మంత్రులు ప్రకటనలు చేస్తూనే వస్తున్నారు. కానీ ఇంతవరకు జరిగింది లేదు. ఇప్పటికే న్యాయ పరమైన చిక్కులతో మూడు రాజధానుల బిల్లుని ఉపసంహరించుకున్నారు. కానీ త్వరలోనే మళ్ళీ బిల్లు పెడతామని, విశాఖ వేదికగా జగన్ పాలన మొదలవుతుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ పదే పదే చెబుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖ నుంచి జగన్ పాలన చేస్తారని అంటున్నారు.

అయితే ఇటీవల అమరావతి ఒకే రాజధానిగా ఉండాలని చెప్పి..ఆ ప్రాంత ప్రజలు, రైతులు చేస్తున్న ఉద్యమం వెయ్యి రోజులు పూర్తి చేసుకుంది. ఇదే క్రమంలో వారు అమరావతి టూ అరసవెల్లి(శ్రీకాకుళం)వరకు పాదయాత్ర మొదలుపెట్టారు. ఇలా అమరావతి రైతులు పాదయాత్ర మొదలుపెట్టడంతో..వైసీపీ నేతలు మూడు రాజధానులు అనడం మొదలుపెట్టారు. అలాగే రాజధాని రైతుల యాత్రని ఉత్తరాంధ్రలో ఖచ్చితంగా అడ్డుకుంటామని మంత్రులు ప్రకటన చేస్తున్నారు. అలాగే ఇటీవల అసెంబ్లీలో సైతం అమరావతిపై తీవ్ర విమర్శలు, మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై జగన్‌తో సహ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద స్పీచ్‌లు ఇచ్చారు.

అంటే అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారనే ఈ విధంగా వైసీపీ మూడు రాజధానుల కాన్సెప్ట్‌ని తెరపైకి తీసుకొచ్చారనే కోణం కూడా కనిపిస్తోంది. అయితే మూడు రాజధానులని చెప్పి మూడేళ్లు అవుతుంది..అయిన ఇంతవరకు రాష్ట్రానికి రాజధాని ఏదో తెలియని పరిస్తితి తీసుకొచ్చారు. ఇప్పుడు వచ్చే విద్యా సంవత్సరం అంటున్నారు. అంటే 2023 జూన్‌లో..ఎలాగో ఏడాదికి ఎన్నికలు జరుగుతాయి.

అలాంటప్పుడు ఇప్పటికిప్పుడు విశాఖ వేదికగా పాలన మొదలుపెడితే…అందులో రాజకీయ కోణం తప్ప..ప్రజలకు మేలు చేసే కోణం కనబడదు. అలాగే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అవ్వడం కూడా జరిగే పనిలా కనిపించడం లేదు. ఓవరాల్ గా చూస్తే మూడు రాజధానులు ఎన్నికల్లోపు అయ్యేలా లేవు..ఒకవేళ ఎన్నికల ముందు ఎలాంటి కార్యక్రమం చేసినా వైసీపీకి వచ్చే మైలేజ్ కూడా పెద్దగా ఉండేలా లేదు.

Read more RELATED
Recommended to you

Latest news