మేయర్ పక్కన ఉండగా… అన్నీ తానై భర్త ప్రసంగం… విశాఖలో కొత్త వివాదం

ఆంధ్రప్రదేశ్ లో ప్రతీ ఒక్కరు ఎంతో ఉత్కంటగా చూసిన విశాఖ మేయర్ పదవి విషయంలో వైసీపీ అనుకున్నది సాధించింది. తన లక్ష్యాన్ని చేరుకుంది… ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక వివాదం ఇబ్బంది పెట్టారు. మేయర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి ప్రెస్ మీట్ నిర్వహించిన విశాఖ మేయర్ హరి వెంకట కుమారి వివాదంలో చిక్కుకున్నారు. మేయర్ ఛైర్ పక్కనే కూర్చున్న మేయర్ భర్త శ్రీనివాస్ కాస్త ఎక్కువ జోక్యం చేసుకున్నారు.

జీవీఎంసీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి మాట్లాడుతూ మేయర్ పదవి ఇచ్చిన సీఎం జగన్,విజయ సాయిరెడ్డి, వైసీపీ నేతలకు కృతజ్ఞతలు చెప్పారు. పరిపాలన రాజధాని కి అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తాను అని హామీ ఇచ్చారు. వారానికి ఒకసారి డయిల్ యువర్ మేయర్..వార్డుల్లో పర్యటన చేస్తాం అని తెలిపారు. నగరంలో మంచినీటి సమస్యతో పాటు అన్ని సమస్యలు పరిష్కరిస్తాము అని పేర్కొన్నారు.

జివిఎంసి లో ప్రాజెక్టులు త్వరత గతిన పూర్తి చేస్తాము అని చెప్పారు. విలేఖరులు అడిగిన పలు ప్రశ్నలకు బదులు ఇవ్వలేపోయారు మేయర్. మేయర్ తరపున భర్త శ్రీనివాస్ సమాధానాలు చెప్పడం పై పలు విమర్శలు వచ్చాయి. కీలక ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మేయర్ నీళ్ళు నమిలారు.