తెలంగాణ రాజకీయాల్లో జగ్గారెడ్డి ఎప్పటికప్పుడు సంచలనాలు సృష్టించే నాయకుడు…అది కూడా సొంత పార్టీలోనే సంచలనాలు సృష్టించడం జగ్గారెడ్డికి బాగా అలవాటు. ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏదొక రచ్చ లేపడం జగ్గారెడ్డికి షరా మామూలు అయిపోయింది. ఎప్పుడైతే పిసిసి అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డికి దక్కిందో అప్పటినుంచి జగ్గారెడ్డి…ఏదొక విధంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూనే ఉన్నారు.
అసలు జగ్గారెడ్డి తమ ప్రత్యర్ధి పార్టీలపై ఏ స్థాయిలో విమర్శలు చేశారో తెలియదు గాని…రేవంత్ రెడ్డిపై మాత్రం ఓ రేంజ్ లో ఫైర్ అవుతూ ఉంటారు..తాజాగా కూడా అలాగే రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. కేసీఆర్ ని కలిసిన యశ్వంత్ సిన్హాని కాంగ్రెస్ పార్టీ నేతలు కలవొద్దని రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. కానీ విహెచ్ వెళ్ళి యశ్వంత్ కు స్వాగతం చెప్పి వచ్చారు. దీనిపై రేవంత్ మాట్లాడుతూ..ఆదేశాలు బేఖాతరు చేస్తే తమ నాయకులని గొడకేసి కొడతానని అన్నారు.
దీనిపై జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. అసలు కొట్టడానికి రేవంత్ ఎవరు? అని ప్రశ్నించిన ఆయన…కొట్టించుకోవడానికి రేవంత్ ఇంట్లో పాలేరులు కాదని అన్నారు. అలాగే షార్ట్ టెంపర్ ఉన్న రేవంత్ రెడ్డి పిసిసి పదవికి అనర్హుడు అని మాట్లాడారు..రేవంత్ పై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని చెప్పి…పైగా సోమవారం సంచలన ప్రకటన చేస్తానని చెప్పారు. దీంతో జగ్గారెడ్డి ఎలాంటి సంచలన ప్రకటన చేస్తారో అని అంతా ఎదురు చూశారు. తీర చూస్తే సంచలనానికి ఇంకా సమయం ఉందని అంటున్నారు.
అలాగే తాను ఎవరిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనని, ఏం మాట్లాడినా పార్టీ మంచి కోసమేనని, పార్టీ లైన్‌లోనే ఉంటా.. ఎక్కడికీ పోనని, ఒకవేళ పోవాలి అనుకుంటే తనని ఆపేదెవరు? అని మాట్లాడారు. అసలు జగ్గారెడ్డి మాటలు చూస్తుంటే..ఆయన మాటల వెనుక ఏమైనా రాజకీయ వ్యూహం ఉందా? లేక రేవంత్-జగ్గారెడ్డి కావాలని గొడవ పడుతున్నట్లు రాజకీయం చేస్తున్నారా? అది కాదంటే జగ్గారెడ్డి ఆల్రెడీ జంపింగుకు రెడీగా ఉండి…కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేయడానికి చూస్తున్నారా? అనేది అర్ధం కావట్లేదు..టోటల్ గా జగ్గారెడ్డి కాన్సెప్ట్ ఏంటో తెలియడం లేదు…మరి ఆ సంచలన ప్రకటన చేస్తే గాని అసల విషయం బయటపడుతుందేమో.