పవన్ వన్ మ్యాన్ షో ఎప్పుడు?

సినిమాల్లో పవన్ కల్యాణ్ వన్ మ్యాన్ షో చాలా సార్లు చూశాం గాని…రాజకీయాల్లో మాత్రం ఎప్పుడు చూడలేదు..ఇంతవరకు ఆయన రాజకీయాల్లో సింగిల్ గా సత్తా చాటిన సందర్భాలు కనిపించడం లేదు…అలాగే భవిష్యత్‌లో కూడా ఇప్పుడు ఆయన వన్ మ్యాన్ షో కనిపించేలా లేదు..ఎందుకంటే ఆయన ఎప్పుడు పొత్తుల గురించే మాట్లాడుతుంటే…ఇంకా సింగిల్ గా సత్తా చాటేది ఎప్పుడు పవన్ సీఎం అయ్యేది ఎప్పుడు.

మామూలుగా ఏ సభలో అయిన జనసేన శ్రేణులు..సీఎం పవన్, సీఎం పవన్ అని అరుస్తారు గాని, ఈ అరుపులు మాత్రం నిజమయ్యేలా లేవు. సరే 2014లో కొత్తగా పార్టీ పెట్టారు…అప్పుడు ఓట్లు చీలకూడదని చెప్పి…టీడీపీ-బీజేపీలకు మద్ధతు ఇచ్చి…వారు అధికారంలోకి రావడానికి కృషి చేశారు. అక్కడితో ఆ కథ అయిపోయింది..ఆ తర్వాత నుంచి పవన్ సింగిల్‌గా బలపడాలసిన అవసరం ఉంది. కానీ అలా జరగలేదు..అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీని బలహీన పర్చడం, అధికారంలో ఉన్న టీడీపీ వ్యతిరేక ఓట్లని తమ వైపు లాక్కోవడంలో పవన్ విఫలమయ్యారు.

అందుకే 2019 ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసిన సరే పవన్ పార్టీ కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకుంది. సరే రెండోసారి కూడా అయిపోయింది..ఆ తర్వాత నుంచైనా జనసేనని బలోపేతం చేసి..2024 ఎన్నికల్లో సత్తా చాటాలనే ఆలోచన కూడా పవన్ చేసినట్లు లేరు. పైగా వీక్ గా ఉన్న టీడీపీని వీక్ చేసి, వైసీపీ వ్యతిరేక ఓట్లని తమ వైపు తిప్పుకోవడంలో మళ్ళీ పవన్ విఫలమయ్యారు. అందుకే ఇప్పటికీ ఏపీలో జనసేన బలపడలేదు.

పైగా మళ్ళీ టీడీపీతో పొత్తు కోసం పవన్ రెడీ అయ్యారు…అంటే చంద్రబాబుని మళ్ళీ సీఎం చేయడానికి పవన్ సిద్ధమయ్యారు. అంటే 2024లో పవన్ వన్ మ్యాన్ షో ఉండదు…అలా కొనసాగితే 2029లో కూడా ఉండదు. మరి ఇలాగే ముందుకెళితే పవన్ వన్ మ్యాన్ షో చూడలేరు…సీఎం అవ్వడం కూడా చూడలేరు.