చట్టసభల్లో బీసీలకు ప్రాధాన్యత ఎక్కడ

-

తెలంగాణలో ఇప్పుడు బీసీ నినాదం తెరమీదకు వచ్చింది.అనేక ఏళ్ళుగా అంటే ఉమ్మడి ఏపీ మొదలు ఇప్పటి వరకు ఒక్కరంటే ఒక్కరు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు సీఎం అయిన దాఖలాలు లేవు. ఇప్పుడు దీనిని బీసీలు గట్టిగా వినిపిస్తున్నారు. సీఎం అయ్యే అర్హత బీసీలకు లేదా అని ప్రశ్నిస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు ఇవ్వాలని అన్ని పార్టీల నుంచి కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి.జనాభాలో బీసీలు 52శాతం ఉండగా కనీసం 20 శాతం కూడా ప్రాధాన్యం దక్కలేదని ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో కేవలం 22 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉండటం గమనార్హం.అటు బీసీ సంఘాలు కూడా చట్టసభల్లో రిజర్వేషన్‌లు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

దశాబ్దాలు గడుస్తున్నా రాజకీయంగా బీసీలకు సరైతన ప్రాతినిథ్యం దక్కకపోవడంతో ఆయా వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. జనాభాలో అందరికంటే ఎక్కువగా ఉన్నా సీట్ల కేటాయింపులో మొదటి నుంచీ అన్యాయమే జరుగుతోందని ఆందోళన చెందుతున్నారు.కాంగ్రెస్‌లో ఇప్పటికే టీమ్‌ ఓబీసీ పేరుతో ఒక గ్రూపు కూడా ఏర్పాటైంది. ఉమ్మడి ఏపీ మొదలు తెలంగాణ రాష్ర్టం వచ్చే వరకు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు సీఎంలు కాలేదు. ఉమ్మడి ఏపీకి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. దాదాపు 12 సార్లు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలే సీఎం అయ్యారు. ఆ తర్వాత ఆరుసార్లు కమ్మ,మూడు సార్లు వెలమలు ఎస్సీ,బ్రాహ్మణ,వైశ్య వర్గాల నేతలు ఒక్కోసారి సీఎం పదవి చేపట్టారు.

తెలంగాణ రాష్ర్టం ఏర్పడ్డాక తెలంగాణలో బీసీల ప్రాతినిథ్యం గణనీయంగా తగ్గింది.1999లో తెలంగాణ ప్రాంతం నుంచి 24 శాతం మంది బీసీ ఎమ్మెల్యేలు ఉండగా ఇప్పుడు వారివాటా 18 శాతానికి చేరింది. తెలంగాణకు చెందిన సీట్లు అప్పట్లో 107 స్థానాలు ఉండగా ఇప్పుడు మొత్తం 119కి పెరిగింది. సీట్లు పెరిగాయి కానీ బీసీల ప్రాధాన్యం పెరగకపోవడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. తెలంగాణ వచ్చాక తొలిసారి జరిగిన ఎన్నికల్లో బీసీ ఎమ్మెల్యేల వాటా 16.08 శాతంగా ఉంది.ఒకనైనా ప్రాధాన్యం కల్పించకపోతే పోరాఆలు తప్పవని రాజకీయ పార్టీలను బీసీలు హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version