జగ్గన్న..ఎక్కడన్న.? రూట్ మారుస్తావా ఏంది?

-

జగ్గారెడ్డి..ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు..ఆయన ఎప్పుడు ముక్కు సూటిగానే మాట్లాడేస్తూ ఉంటారు. సొంత పార్టీలో లొల్లి ఉన్న వెంటనే బయటకు చెప్పేస్తారు. అవసరమైతే సొంత పార్టీ నేతలపై కూడా విమర్శలు చేస్తారు. ఇక రేవంత్ రెడ్డి పి‌సి‌సి అధ్యషుడు అయ్యాక ఆయన్ని ఏ స్థాయిలో టార్గెట్ చేశారో చెప్పాల్సిన పని లేదు. మధ్యలో కాంగ్రెస్ అధిష్టానం పిలిచి మాట్లాడటంతో ఇంకా ఎవరిని విమర్శించనని అన్నారు.

సరే అంతవరకు బాగానే ఉంది..కానీ ఉన్నట్టు ఉండి కాంగ్రెస్ లో జగ్గారెడ్డి మాయమాయ్యారు. కాంగ్రెస్ రేసులో లేనప్పుడు దూకుడుగా ఉన్నారు..రేసులోకి వచ్చాక కనబడటంలేదు. అసలు ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ కు కొత్త ఊపు వచ్చింది. ఆ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతుంది. అలాగే సీనియర్ నేతలంతా ఇప్పుడు కలిసికట్టుగా పనిచేయడానికి రెడీ అవుతున్నారు. కానీ జగ్గన్న మాత్రం అడ్రెస్ లేరు. దీంతో అసలు ఆయన ఏం అయ్యారు? పార్టీకి ఏమైనా దూరం అవుతారా? అనే చర్చ నడుస్తుంది.

తాజాగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో సీనియర్ నేతలంతా కలిసిన విషయం తెలిసిందే. ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో సహ రేవంత్ రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి, షబ్బీర్ అలీ, కోదండ రెడ్డి, సంపత్ కుమార్, అంజన్ కుమార్ యాదవ్, మహేశ్ కుమార్ గౌడ్..ఇలా కీలక నేతలంతా ఒకచోటు చేరి..ఇకపై కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు.

అంతా ఉన్నారు కానీ..జగ్గారెడ్డి మాత్రం రాలేదు. మరి ఆయనకు ఆహ్వానం లేదా? అందరు సీనియర్లు వచ్చినప్పుడు జగ్గారెడ్డిని పిలవకుండా ఉండరు. అలాగే ఆయన ఇప్పుడు మీడియాలో కూడా కనిపించడం లేదు. దీంతో ఆయనపై అనేక అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికే నెక్స్ట్ ఎన్నికల్లో తాను పోటీ చేయనని, తన కుమార్తె పోటీ చేస్తుందని చెప్పారు. కానీ ఏ పార్టీ అనేది ఇప్పుడు డిసైడ్ అవుతున్నారా? కాంగ్రెస్ వదిలి బి‌ఆర్‌ఎస్ వైపు వెళ్లడానికి చూస్తున్నారా? అనే డౌట్ వస్తుంది. ఇక ఏదైనా జగ్గారెడ్డి బయటకొచ్చి క్లారిటీ ఇస్తేనే తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news