తెలంగాణా కాంగ్రెస్ లో సస్పెండ్ అయ్యేది ఎవరు…?

-

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని మార్చే అవకాశం ఉందని ప్రచారం ఈ మధ్యకాలంలో జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజం ఏంటనేది దానిపై స్పష్టత లేదు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు విషయంలో కొన్ని కీలక నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం త్వరలోనే తీసుకునే అవకాశాలు ఉండవచ్చని తెలుస్తోంది. కొంతమంది కీలక నేతలు ఈ మధ్యకాలంలో ఇబ్బందికరంగా వ్యవహరించడంతో కార్యకర్తలు కూడా ఇబ్బంది పడుతున్నారు.

కాబట్టి త్వరలోనే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం అడుగులు వేస్తోందని సమాచారం. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి కొంత మంది ఎమ్మెల్యేలు సహకరిస్తున్నారని అంతే కాకుండా కొంత మంది ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీనుంచి టీఆర్ఎస్ పార్టీకి ప్రోత్సాహం అందిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధిష్టానంకు సమాచారం అందింది.

జానారెడ్డి విషయంలో కొంతమంది ఇబ్బందికరంగా ఉండడంతో ఆయనకు ద్రోహం చేస్తున్నారు అనే భావన కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పుడు నాగార్జునసాగర్ ఎన్నికలకు సంబంధించి ప్రతి అంశాన్ని సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. జానారెడ్డినే కాకుండా పార్టీని మోసం చేసే కొంతమందిని గుర్తించిందని కాబట్టి జానారెడ్డి నుంచి నివేదిక తీసుకున్న తర్వాత చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని ఎవరినైనా సస్పెండ్ చేయవచ్చు అని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news